Telugu Global
Others

చర్చిలో హిందూ, ముస్లిం వ‌ధూవ‌రుల‌ పెళ్లి

కులాంత‌ర‌, మ‌తాంత‌ర వివాహాల‌ను సాధార‌ణంగా పెద్ద‌లు ఆమోదించ‌రు. కాని ఈ వ‌ధూవ‌రుల విష‌యంలో పెద్ద‌లు అంగీక‌రించారు. అంతే కాదు… మ‌రో అడుగు ముందుకేసి వీరి రెండు మ‌తాల సంప్ర‌దాయానికి భిన్నంగా మూడో మ‌తానికి చెందిన సంప్ర‌దాయంలో వివాహం జ‌రిపించారు… వినూత్న‌రీతిలో సాగిన ఈ క‌థ‌కు సూత్ర‌ధారులు ఒక‌రు ముస్లిం… మ‌రొక‌రు హిందు… పాత్ర‌ధారులు త‌ల్లిదండ్రులు. ఖాదర్‌వలీ.. జ్యోత్స్నల మతాలు వేరయినా మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటవ్వాలన్న వీరి ఆలోచనకు ఇరు కుటుంబాల నుంచి ఆమోదం లభించింది. […]

కులాంత‌ర‌, మ‌తాంత‌ర వివాహాల‌ను సాధార‌ణంగా పెద్ద‌లు ఆమోదించ‌రు. కాని ఈ వ‌ధూవ‌రుల విష‌యంలో పెద్ద‌లు అంగీక‌రించారు. అంతే కాదు… మ‌రో అడుగు ముందుకేసి వీరి రెండు మ‌తాల సంప్ర‌దాయానికి భిన్నంగా మూడో మ‌తానికి చెందిన సంప్ర‌దాయంలో వివాహం జ‌రిపించారు… వినూత్న‌రీతిలో సాగిన ఈ క‌థ‌కు సూత్ర‌ధారులు ఒక‌రు ముస్లిం… మ‌రొక‌రు హిందు… పాత్ర‌ధారులు త‌ల్లిదండ్రులు. ఖాదర్‌వలీ.. జ్యోత్స్నల మతాలు వేరయినా మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటవ్వాలన్న వీరి ఆలోచనకు ఇరు కుటుంబాల నుంచి ఆమోదం లభించింది. అబ్బాయేమో ముస్లిం.. అమ్మాయి హిందూ.. అయితే పెళ్లి మాత్రం క్రైస్తవ మతాచారాల ప్రకారం చేసుకోవాలని భావించారు. పెద్దలను ఒప్పించి ఖాదర్‌, జ్యోత్స్న ఆదివారంనాడు ఇలా ఒక్కటయ్యారు. తిరుపతికి చెందిన ఎస్‌.ఖాదర్‌వలీ స్థానిక ఎస్‌బీఐ జోనల్‌ కార్యాలయంలో పనిచేస్తుండగా.. నెల్లూరుకు చెందిన జ్యోత్స్న వడమాలపేట ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఉద్యోగిని. తిరుపతిలోని డీపీఆర్‌ కల్యాణ మంటపంలో ఫాదర్‌ నీలం సుబ్బారావు వీరి వివాహాన్ని జరిపించారు.
First Published:  31 May 2015 6:35 PM IST
Next Story