రైతు కోసం సీపీఎం మహా ధర్నా..
ఏపీ రాజధాని ప్రాంతంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉంటే భూమి పూజ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం పట్ల సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఉండవల్లి ప్రాంతంలో ఆ పార్టీ మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో రైతులు..ఇతరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 29 గ్రామాల్లో 39వేల భూమిని సేకరించిందన్నారు. రాష్ట్ర రాజధానికి సీపీఎం వ్యతిరేకం […]
BY sarvi31 May 2015 6:38 PM IST
sarvi Updated On: 1 Jun 2015 12:50 PM IST
ఏపీ రాజధాని ప్రాంతంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉంటే భూమి పూజ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం పట్ల సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఉండవల్లి ప్రాంతంలో ఆ పార్టీ మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో రైతులు..ఇతరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 29 గ్రామాల్లో 39వేల భూమిని సేకరించిందన్నారు. రాష్ట్ర రాజధానికి సీపీఎం వ్యతిరేకం కాదని, అనుసరించే పద్ధతులకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా ? అని సూటిగా ప్రశ్నించారు. రైతులను భయాందోళనలకు గురిచేసి భూములు సేకరించే పనిలో ఉందని, తాము నష్టపోతామని రైతులను భయపెడుతున్నారని తెలిపారు. ప్రజల గోడును వినిపించడానికే మహాధర్నా చేపట్టినట్లు, ఆరో తేదీ లోపున స్పందించకపోతే గ్రామ గ్రామాన ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.
Next Story