ఏపీలో మరో లక్షన్నర మందికి పింఛన్లు: కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో మరో లక్షన్నర మందికి పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పింఛన్లను రేపటి నుంచే ఇవ్వనున్నట్టు చంద్రబాబు తెలిపారు. 3 నుంచి చేపట్టే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై చర్చసందర్భంగా పింఛన్ల అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించి యేడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ దీక్షను విజయ వంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. మంత్రులు సొంత జిల్లాల్లో చేపట్టే నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు కోరారు. నవ […]
BY sarvi1 Jun 2015 11:00 AM IST
X
sarvi Updated On: 1 Jun 2015 11:18 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో మరో లక్షన్నర మందికి పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పింఛన్లను రేపటి నుంచే ఇవ్వనున్నట్టు చంద్రబాబు తెలిపారు. 3 నుంచి చేపట్టే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై చర్చసందర్భంగా పింఛన్ల అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించి యేడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ దీక్షను విజయ వంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. మంత్రులు సొంత జిల్లాల్లో చేపట్టే నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు కోరారు. నవ నిర్మాణ దీక్ష ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించే ఏపీ రాజధాని భూమి పూజకు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, దత్తాత్రేయ, ఆశోక్‌గజపతిరాజులను ఆహ్వానించినట్టు చంద్రబాబు కేబినెట్‌లో తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని బాగా ప్రచారం చేయాలని బాబు ఎమ్మెల్యేలందరికీ చెప్పినట్టు తెలిసింది.
మెరెన్, ఆహారశుద్ది, పౌర విమానయాన విధానాలకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని భావించిన నూతన అబ్కారీ విధానంపై మంత్రివర్గం ఏమీ తేల్చలేదు. వచ్చే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 8న నవ నిర్మాణ సభ నిర్వహణ బాధ్యతలు ఏపీ ఇన్‌ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఈ కేబినెట్ సమావేశంలో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఆర్థికాభివృద్ధి మండలి ఏర్పాటుకు, పైబర్ ఆప్టిక్ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 9 నుంచి 16 వరకు ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని చంద్రబాబు చెప్పారు. ప్రపంచ బ్యాంకు నిధులు 2,200 కోట్ల రూపాయలను వినియోగించుకోవాలని, వీటిని హుద్‌హుద్ తుఫాను ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థకు, తుపాను షెల్టర్లకు, ఈ నిధులను ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. కేబినెట్‌లో తెలంగాణలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని, తద్వారా పార్టీని బలహీనపరచాలనుకుంటోందని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకే రేవంత్‌ను కేసులో ఇరికించారని చంద్రబాబు అన్నట్టు తెలిసింది.

Next Story