తరువాత వికెట్.. ప్రకాష్‌గౌడేనా?
మండలి ఎన్నికల పోలింగ్ టీడీపీకి ఉనికికి సంకటంగా మారింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. చేతలుడిగి చూడటం మినహా మరేం చేయలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు . మహానాడు ముగిసి 24 గంటలు ముగియక ముందే కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడటం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మండలి ఎన్నికలకు మరో 24 గంటలే టైముంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న భయం టీడీపీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మూడు వారాలక్రితం ఓ సందర్భంలో తమ రాజేంద్రనగర్ […]
BY Pragnadhar Reddy31 May 2015 4:59 AM IST
X
Pragnadhar Reddy Updated On: 31 May 2015 4:59 AM IST
మండలి ఎన్నికల పోలింగ్ టీడీపీకి ఉనికికి సంకటంగా మారింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. చేతలుడిగి చూడటం మినహా మరేం చేయలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు . మహానాడు ముగిసి 24 గంటలు ముగియక ముందే కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడటం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మండలి ఎన్నికలకు మరో 24 గంటలే టైముంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న భయం టీడీపీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మూడు వారాలక్రితం ఓ సందర్భంలో తమ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తే పార్టీమారేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రకటించిన విషయం వారిని వెంటాడుతూనే ఉంది. మండలి అభ్యర్థి కోసం ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుండటంతో తమలో ఎవరైనా టీఆర్ ఎస్‌కు అనుకూలంగా చేయి ఎత్తితే ఎలా అన్న అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే ముందుజాగ్రత్త చర్యగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సహా అందరికీ పార్టీ తరఫున విప్ జారీ చేయించారు.
ఎన్ని చేసినా జారిపోతున్నారు..!
తెలంగాణలో రోజురోజు బలం తగ్గిపోతున్న క్రమంలో మినీ మహానాడులు, మహానాడులు నిర్వహించినా ఎమ్మెల్యేలు చేయి జారిపోతుండటం తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేస్తోంది. పార్టీమారే కొద్దిరోజుల ముందు మాధవరం కొన్ని షరతులు విధించాడు. కానీ వాటిపై స్పష్టత రాకుండానే.. గులాబీకండువా కప్పుకున్నాడు. అలాగే ప్రకాష్‌గౌడ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రకాష్‌గౌడ్ పై పడింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఈయన వ్యవహారం ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాసేపు మారతానని, మరునాడు మారనని పరస్పర విరుద్ధ ప్రకటనలతో మీడియాను, ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడంలో టీఆర్ ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీడీపీ ఏదైనా పెద్దకార్యక్రమం చేపట్టిన మరునాడో, లేదా ముందు రోజో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని టీడీపీని తెలివిగా మానసికంగా దెబ్బ కొడుతోంది. ఆ విధంగా మిగిలిన ఎమ్మెల్యేలనూ ఆకర్షించే పనిలో ఉంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తోన్న తమ్ముళ్లకు రేపు ఏం జరగబోతోంది? అన్నది తలుచుకుని ఆందోళనగా ఉన్నారు. ఓటమి ఎలాగో ఖరారైంది. అయితే పార్టీలోఉండేవారు ఎందరు? పోయేవారెందరు అన్నది రేపు తేలిపోనుంది.
Next Story