యూట్యూబ్ లో దుమ్ముదులిపిన కండలవీరుడు
రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టించడం సల్మాన్ ఖాన్ హాబీ. ఈసారి కూడా అదే చేశాడు. తన తాజా చిత్రానికి సంబంధించి టీజర్ తో సోషల్ నెట్ వర్కింగ్ లో దుమ్మురేపుతున్నాడు. సల్మాన్ కొత్త సినిమా భజరంగీ బాయ్ జాన్ ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే ఇప్పటివరకు 20లక్షల మంది వీక్షకులు ఈ టీజర్ ను తిలకించారు. మరో వారం రోజుల్లో ఈ కౌంట్ 50లక్షలకు చేరిపోతుందని అంచనాలు కడుతున్నారు. అటు యూట్యూబ్ […]
BY admin31 May 2015 7:13 AM IST
X
admin Updated On: 31 May 2015 7:13 AM IST
రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టించడం సల్మాన్ ఖాన్ హాబీ. ఈసారి కూడా అదే చేశాడు. తన తాజా చిత్రానికి సంబంధించి టీజర్ తో సోషల్ నెట్ వర్కింగ్ లో దుమ్మురేపుతున్నాడు. సల్మాన్ కొత్త సినిమా భజరంగీ బాయ్ జాన్ ప్రస్తుతం యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే ఇప్పటివరకు 20లక్షల మంది వీక్షకులు ఈ టీజర్ ను తిలకించారు. మరో వారం రోజుల్లో ఈ కౌంట్ 50లక్షలకు చేరిపోతుందని అంచనాలు కడుతున్నారు. అటు యూట్యూబ్ తో పాటు పేస్ బుక్ లాంటి సైట్లను కూడా కలుపుకుంటే సల్మాన్ కొత్త సినిమా హిట్స్ సంస్థ ఇప్పటికే 50లక్షలు దాటేసింది.
సాధారణంగా ఎవరూ టీజర్ లో సినిమా గురించి చెప్పాలనుకోరు. కానీ సల్మాన్ మాత్రం టీజర్ లో కథ మొత్తం చెప్పేశాడు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాలో ఇరుక్కున్న ఓ చిన్నారిని, సల్మాన్ తిరిగి ఎలా పాకిస్థాన్ చేర్చాడనేదే స్టోరీ. రెండు దేశాల మధ్య స్టోరీ. పైగా.. సల్మాన్ హిందూ, చిన్నారి ముస్లింగా కనిపిస్తున్న విజువల్స్. దీంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Next Story