పాక్‌లో 22 మంది పష్తూన్‌ల ఊచకోత
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు (బెలూచిస్తాన్ వేర్పాటు వాదులుగా అనుమానం) బస్సులో ప్రయాణిస్తున్న పష్తూన్ తెగకు చెందిన 22 మందిని పట్టుకుని కాల్చేశారు. క్వెట్టా నుంచి కరాచీకి రెండు బస్సుల్లో వస్తున్న వారిని అడ్డగించి ఈ మారణకాండకు పాల్పడ్డారు. మరోవైపు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జింబాబ్వేతో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న గడాఫీ స్టేడియం సమీపంలో ఓ మానవబాంబు పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అటు సిరియాలోనూ ప్రభుత్వ దళాలు వదిలిన బ్యారెల్ బాంబులు […]
BY admin31 May 2015 7:40 AM IST
admin Updated On: 31 May 2015 7:36 AM IST
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు (బెలూచిస్తాన్ వేర్పాటు వాదులుగా అనుమానం) బస్సులో ప్రయాణిస్తున్న పష్తూన్ తెగకు చెందిన 22 మందిని పట్టుకుని కాల్చేశారు. క్వెట్టా నుంచి కరాచీకి రెండు బస్సుల్లో వస్తున్న వారిని అడ్డగించి ఈ మారణకాండకు పాల్పడ్డారు. మరోవైపు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జింబాబ్వేతో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న గడాఫీ స్టేడియం సమీపంలో ఓ మానవబాంబు పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అటు సిరియాలోనూ ప్రభుత్వ దళాలు వదిలిన బ్యారెల్ బాంబులు 71 మంది పౌరులను బలితీసుకున్నాయి.
Next Story