జర నవ్వండి ప్లీజ్ 99
డాక్టర్ ఆ యువకుడికి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేశాడు. కొన్నాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న ఆ యువకుడు “థ్యాంక్యూ డాక్టర్” అన్నాడు. “అరే ఎందుకయ్యా! నువ్వేం నా మొదటి పేషెంటువా?” “మీ మొదటి పేషెంట్ మా అంకుల్. మీ దయవల్ల ఆయన ఆస్తంతా నాకు వచ్చింది” అన్నాడు. —————————— కోళ్ళఫారంలో కోళ్ళు చనిపోతూ ఉంటే వాటి ప్రాబ్లం ఏమిటో అర్ధంకాక అగ్రికల్చరల్ అడ్వైజర్ దగ్గరికి పదికోళ్ళని పట్టుకెళ్ళి ఇచ్చి పరీక్షలు చెయ్యమన్నాడు. నెల తరువాత అడ్వైజర్ టెలిగ్రాం ఇచ్చాడు. “నీ […]
డాక్టర్ ఆ యువకుడికి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేశాడు. కొన్నాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న ఆ యువకుడు “థ్యాంక్యూ డాక్టర్” అన్నాడు.
“అరే ఎందుకయ్యా! నువ్వేం నా మొదటి పేషెంటువా?”
“మీ మొదటి పేషెంట్ మా అంకుల్. మీ దయవల్ల ఆయన ఆస్తంతా నాకు వచ్చింది” అన్నాడు.
——————————
కోళ్ళఫారంలో కోళ్ళు చనిపోతూ ఉంటే వాటి ప్రాబ్లం ఏమిటో అర్ధంకాక అగ్రికల్చరల్ అడ్వైజర్ దగ్గరికి పదికోళ్ళని పట్టుకెళ్ళి ఇచ్చి పరీక్షలు చెయ్యమన్నాడు.
నెల తరువాత అడ్వైజర్ టెలిగ్రాం ఇచ్చాడు. “నీ కోళ్ళు చనిపోయాయి. కానీ మంచి రుచిగా ఉన్నాయి”.
——————————
ఒక రాజకీయ పార్టీ అభ్యర్ధి ఆవేశంగా సభలో ఉపన్యసిస్తున్నాడు.
“మనం కమ్యూనిజాన్ని, అనార్కిజాన్ని, రాడికలిజాన్ని నిర్మూలించాలి”
సభలో ఒక ముసలాడు లేచి “మరి రుమాటిజం (మోకాళ్ళనోప్పులు) సంగతేమిటి?” అని అడిగాడు.
——————————
ఒక రైతుకు ఎనిమిదిమంది కొడుకులు. ఎలక్షన్లలో ఏడుమంది ఒక పార్టీకి ఓటు వేశారు. ఎనిమిదోవాడు ప్రసాద్ ఇంకో పార్టీకి ఓటు వేశాడు. ఈ సంగతి తెలిసి రైతు “వీణ్ణి అనవసరంగా చదివించినట్లున్నాను” అని వాపోయాడు.