Telugu Global
Cinema & Entertainment

స్లిమ్ గా తయారవుతున్న మెగాస్టార్

తన 150వ సినిమా కోసం చిరంజీవి అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారు. ఆటోజానీ క్యారెక్టర్ కోసం స్లిమ్ గా తయారయ్యేందుకు సిద్ధమౌతున్నారు. చిరంజీవికి పెద్దగా టైమ్ కూడా లేదు. ఆగస్ట్ 22న సినిమాను లాంఛ్ చేయాలి. ఆ వెంటనే మూవీ సెట్స్ పైకి వెళ్లాలి. కాబట్టి ఈ 3 నెలల గ్యాప్ లోనే ఒంట్లోని కొవ్వంతా కరిగిపోవాలి. రౌడీ అల్లుడు ఫిజిక్ వచ్చేయాలి. ఇదే ఇప్పుడు చిరంజీవి టార్గెట్. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా లండన్ చెక్కేశారు చిరు. ప్రముఖ […]

స్లిమ్ గా తయారవుతున్న మెగాస్టార్
X
తన 150వ సినిమా కోసం చిరంజీవి అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారు. ఆటోజానీ క్యారెక్టర్ కోసం స్లిమ్ గా తయారయ్యేందుకు సిద్ధమౌతున్నారు. చిరంజీవికి పెద్దగా టైమ్ కూడా లేదు. ఆగస్ట్ 22న సినిమాను లాంఛ్ చేయాలి. ఆ వెంటనే మూవీ సెట్స్ పైకి వెళ్లాలి. కాబట్టి ఈ 3 నెలల గ్యాప్ లోనే ఒంట్లోని కొవ్వంతా కరిగిపోవాలి. రౌడీ అల్లుడు ఫిజిక్ వచ్చేయాలి. ఇదే ఇప్పుడు చిరంజీవి టార్గెట్. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా లండన్ చెక్కేశారు చిరు. ప్రముఖ ఫారిన్ జిమ్ ట్రయినర్ ఆధ్వర్యంలో కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పుడున్న స్టార్ హీరోలు మహేష్, పవన్, ప్రభాస్ లాంటి వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్ ను సిద్ధం చేస్తున్నారు. సో.. 150వ సినిమా ఫస్ట్ క్లాప్ టైమ్ కు ఓ సరికొత్త చిరంజీవిని అంతా చూడబోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రాబోతున్నఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే కూడా పూర్తయిపోయిందని సమాచారం. స్క్రీన్ ప్లే వర్క్ కూడా పూర్తయి,సంతృప్తి చెందిన తర్వాత లండన్ బయల్దేరారట చిరంజీవి.
First Published:  31 May 2015 3:33 AM IST
Next Story