Telugu Global
Cinema & Entertainment

చార్మీ ని చిరంజీవి ఆదుకుంటాడా..?

ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుండి గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా, తన అందాలు చూపించడంలో మొహమాటం పడకుండా చూపించేసింది హాట్ బ్యూటీ చార్మి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వినియోగించుకొని నటిగా మంచి మార్కులే కొట్టేసింది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్ లతో కూడా కుర్రకారులకు బాగా దగ్గర అయ్యింది . ఇక సినిమాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో లేడీ ఒరియెంటెడ్ సినిమాల ప్రభావం కాస్త ఉండటంతో, అటు కూడా అడుగులు వేసింది.    మంత్ర […]

చార్మీ ని చిరంజీవి ఆదుకుంటాడా..?
X
ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుండి గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా, తన అందాలు చూపించడంలో మొహమాటం పడకుండా చూపించేసింది హాట్ బ్యూటీ చార్మి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వినియోగించుకొని నటిగా మంచి మార్కులే కొట్టేసింది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్ లతో కూడా కుర్రకారులకు బాగా దగ్గర అయ్యింది . ఇక సినిమాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో లేడీ ఒరియెంటెడ్ సినిమాల ప్రభావం కాస్త ఉండటంతో, అటు కూడా అడుగులు వేసింది.
మంత్ర సినిమా చార్మీ కెరీర్ లో బెస్ట్ గా నిలిచింది. ఇక ఆతర్వాత చార్మీ పరిస్తితి బాగా డల్ అయ్యింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘జ్యోతిలక్ష్మి’ పైనే ఈ ముద్దు గుమ్మ ఆశలు పెట్టుకుంది. ఇక సినిమా ఆడియో జూన్ 4 న ప్లాన్ చేసాడు పూరి. ఇక ఈ ఆడియో కి మెగాస్టార్ చిరంజీవి ని గెస్ట్ గా పిలుద్దామని అనుకుంటున్నారు అట. ఎలాగో చిరు 150 సినిమా పూరి చేస్తున్నాడు కాబట్టి, ఆ అభిమానంతో అయినా ఈ వేడుకకి రప్పిస్తే. అది ఈ సినిమాకి కూడా బాగా ఉపయోపడుతుంది అని యూనిట్ వాళ్ళ ప్లాన్. ఒకవేళ చిరు నిజంగానే వస్తే ఈ జ్యోతిలక్ష్మి సినిమా అనుకున్న దాని కన్నా ఎక్కువ ప్రమోషన్ జరిగినట్లే. మరి ఇలా చేసి చిరు, చార్మీ ని ఆదుకుంటాడో లేదో చూడాలి..!
First Published:  30 May 2015 7:26 AM IST
Next Story