కలిసి ఉంటే కలదు సుఖం: సీఎస్‌లకు 'హోం' హితవు
ఏపీ, టీఎస్ రాష్ట్రాల సీఎస్‌లు కలిసి పని చేయాలని, దీనివల్ల ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయిల్ తమను కోరినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తదనంతర పరిణామాలపై శనివారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం […]
BY sarvi30 May 2015 10:12 AM IST
X
sarvi Updated On: 30 May 2015 10:12 AM IST
ఏపీ, టీఎస్ రాష్ట్రాల సీఎస్‌లు కలిసి పని చేయాలని, దీనివల్ల ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయిల్ తమను కోరినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తదనంతర పరిణామాలపై శనివారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముందుకెళ్ళాలని హోంశాఖను కోరామని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ తెలిపారు. గవర్నర్ అధికారాలపై ఏపీ సీఎస్ ప్రస్తావించారని, తాను అభ్యంతరం చెప్పానని చెప్పారు. గవర్నర్ అధికారాలపై మార్గదర్శకాల నిర్ణయానికి చట్ట సవరణ చేయాల్సి ఉందని హోం శాఖ కార్యదర్శి తెలిపారని రాజీవ్ శర్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు వివరించారు. షెడ్యూల్ 9 లోని 89 సంస్థల్లో ఆరు సంస్థలు మినహా మిగిలిన సంస్థలపై ఇరు రాష్ట్రాలకు అంగీకారం కుదిరిందని ఆయన చెప్పారు. షీలాబేడీ కమిటీ సిఫార్సుల ఆధారంగా అర్టీసీ, మినరల్ వాటర్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విభజన జరుగుతుందని ఆయన అన్నారు. గవర్నర్‌తో మాట్లాడిన తర్వాత సెక్షన్ 8ని అమలును పరిశీలిస్తామని హోంశాఖ కార్యదర్శి చెప్పారని కృష్ణారావు తెలిపారు. 10 షెడ్యూల్ ప్రకారం ఉన్న సంస్థల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని హోంశాఖ కార్యదర్శి చెప్పినట్టు కృష్ణారావు తెలిపారు.
ఇప్పటికే కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి డీకే సింగ్‌నేతృత్వంలో ఇరురాష్ర్టాల సీఎస్‌లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. అయితే ఆ భేటీలో ఇరురాష్ర్టాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఈరోజు ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 9,10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులు, సంస్థలు జనాభా నిష్పత్తిలో ఇరురాష్ర్టాలు పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం చట్టంలో పేర్కొంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా ప్రాంతాల ప్రాదిపదికనే విభజన జరగాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్న ఆస్తులు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆస్తులు ఏపీకే చెందుతాయన్న వాదనను తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తోంది.
Next Story