"శేషాచలం"పై సీబీఐ దర్యాప్తు జరపండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిఫారసు చేసింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున తాత్కాలిక పరిహారం ఇవ్వాలని ఏపీని ఆదేశించింది. ‘శేషాచలం’ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొన్ని ఆదేశాలు, సూచనలు చేసింది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఏప్రిల్ 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం దొంగలు మృతి చెందిన సంగతి […]
BY admin30 May 2015 4:06 PM IST
X
admin Updated On: 30 May 2015 4:06 PM IST
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిఫారసు చేసింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున తాత్కాలిక పరిహారం ఇవ్వాలని ఏపీని ఆదేశించింది. ‘శేషాచలం’ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొన్ని ఆదేశాలు, సూచనలు చేసింది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఏప్రిల్ 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం దొంగలు మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధితుల పూర్వాపరాలు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటంలో ఆలస్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చూపిన పురోగతి, ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు, శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలంగోల సాక్ష్యం, తమకు సమాచారం ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం అయిష్టత ప్రదర్శించటం మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. వీటిని బట్టి.. ఎర్రచందనం ఎన్‌కౌంటర్‌లో 20 మంది మృతికి మానవహక్కుల ఉల్లంఘన జరిగిందనేందుకు ఆధారాలున్నాయని ప్రకటించింది. బాధితులంతా పేదలని, వారిని కోల్పోయి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది. అయితే, తమ విచారణ లేదా మరొక విచారణ పూర్తయ్యే వరకూ ఈ కుటుంబాలను ఇలాగే ఇబ్బందులు పడనివ్వబోమని పేర్కొంది.
Next Story