తెలంగాణ అసెంబ్లీ రద్దు: కేసీఆర్
ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. జూన్ 1న జరిగే మండలి అభ్యర్థుల ఎన్నికలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఈ వ్యాఖ్యలకు కారణం. నలుగురు టీడీపీ, మరో ముగ్గురు కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ మద్దతులతో మరో సీటు కోసం 5వ అభ్యర్థిని పోటీలోకి దించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు వెళ్లిన టీడీపీ, కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ వ్యవహారంలోనూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో […]
BY Pragnadhar Reddy30 May 2015 4:20 AM IST
X
Pragnadhar Reddy Updated On: 30 May 2015 4:20 AM IST
ఈ మాట అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. జూన్ 1న జరిగే మండలి అభ్యర్థుల ఎన్నికలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఈ వ్యాఖ్యలకు కారణం. నలుగురు టీడీపీ, మరో ముగ్గురు కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ మద్దతులతో మరో సీటు కోసం 5వ అభ్యర్థిని పోటీలోకి దించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు వెళ్లిన టీడీపీ, కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ వ్యవహారంలోనూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. దీంతో టీఆర్ ఎస్ గెలుపు ఇక లాంఛనమే అవనుంది. ఇదే ఆత్మవిశ్వాసంతో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓడిపోతే అసెంబ్లీ రద్దు చేస్తానని ధీమాగా ప్రకటించారు. ఆ బాధ్యతలను మంత్రులకు అప్పజెప్పారు. ఈ మేరకు శుక్రవారం తెంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రతికూల ఫలితాలు వస్తే మంత్రి పదవులు ఊడతాయని సభాముఖంగా వార్నింగ్ ఇచ్చారు. మండలి ఎన్నికలకు పార్టీ ఎమ్మెల్యేలను సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా శని, ఆదివారాల్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారన్నమాట. ఈ ఎన్నికలతో టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని కేసీఆర్ బహింరంగంగానే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ర్టంలో మిగిలేవి టీఆర్ ఎస్, కాంగ్రెస్‌లేనని స్పష్టం చేశారు.
Next Story