Telugu Global
Others

కేసీఆర్‌ది రాజ్యాంగ వ్యతిరేక పాలన: క‌ంచె ఐల‌య్య‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుది రాజ్యాంగ విరుద్ధమైన పాలన అని కంచె ఐలయ్య విమర్శించారు. ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘‘కేసీఆర్‌ కుటుంబానికి ఓయూ భూములు ఇచ్చి క్యాంపస్‌ విడిచిపెట్టి వెళ్లిపోదాం, తెలంగాణకు విద్య అక్కరలేదు’’ అనే అంశంపై ఓయూలోని ఆర్ట్స్‌ కాలేజీ న్యూ సెమినార్‌ హాల్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి, కంచె ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలయ్య ప్రసంగిస్తూ.. ఏడాది పాలనలో యూనివర్సిటీలకు సీఎం చేసిందేమీ […]

కేసీఆర్‌ది రాజ్యాంగ వ్యతిరేక పాలన: క‌ంచె ఐల‌య్య‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుది రాజ్యాంగ విరుద్ధమైన పాలన అని కంచె ఐలయ్య విమర్శించారు. ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘‘కేసీఆర్‌ కుటుంబానికి ఓయూ భూములు ఇచ్చి క్యాంపస్‌ విడిచిపెట్టి వెళ్లిపోదాం, తెలంగాణకు విద్య అక్కరలేదు’’ అనే అంశంపై ఓయూలోని ఆర్ట్స్‌ కాలేజీ న్యూ సెమినార్‌ హాల్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి, కంచె ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలయ్య ప్రసంగిస్తూ.. ఏడాది పాలనలో యూనివర్సిటీలకు సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు. ఓయూ భూములను బిల్డర్లకు కట్టబెట్టేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. ఓయూ భూములపై కేంద్రంతో సీఎం కుమ్మకయ్యారని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆలయాలు, యాగాల కోసం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని ఐలయ్య, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
First Published:  30 May 2015 3:59 PM IST
Next Story