స్థలాన్నిఆక్రమించిన రౌడీషీటర్ ఇల్లు స్వాధీనం
ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సిన కమ్యూనిటీ హాల్ స్థలంలో ఓ రౌడీషీటర్ ఇల్లు నిర్మించేసుకున్నాడు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దంత వైద్య కళాశాల ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ నగర్ సర్వే నెం.311లోని 720 గజాల స్థలంలో చింత శేఖర్ ఈ ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నాడు. అయితే.. ఆ స్థలం ప్రభుత్వ రికార్డులలో కమ్యూనిటీ హాల్‌కు కేటాయించినట్లు అధికారులు […]
BY Pragnadhar Reddy29 May 2015 6:36 PM IST
Pragnadhar Reddy Updated On: 30 May 2015 7:10 AM IST
ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సిన కమ్యూనిటీ హాల్ స్థలంలో ఓ రౌడీషీటర్ ఇల్లు నిర్మించేసుకున్నాడు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దంత వైద్య కళాశాల ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ నగర్ సర్వే నెం.311లోని 720 గజాల స్థలంలో చింత శేఖర్ ఈ ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నాడు. అయితే.. ఆ స్థలం ప్రభుత్వ రికార్డులలో కమ్యూనిటీ హాల్‌కు కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జాకు గురైందని స్థలాన్ని కాపాడాలని స్థానికులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు శామీర్‌పేట తహసీల్దార్ దేవుజా తెలిపారు. ప్రజల ఫిర్యాదు మేరకు చింత శేఖర్‌కు నోటీసులు జారీ చేసినా స్పందన కనిపించలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శేఖర్ ఇంటిని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
Next Story