డ్రంక్ అండ్ డ్రైవ్‌లో లేడీ డాక్టర్ హల్‌చల్
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు వింత అనుభవం ఎదరురయ్యింది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు మంజు అనే మహిళా వైద్యురాలు చుక్కలు చూపించింది. వాహనాలు సోదాలు చేస్తున్న సమయంలో డాక్టర్ మంజు వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నించగా అందుకు మంజు నిరాకరించారు. దాదాపు అరగంట పాటు నానా హంగామా సృష్టించారు. చివరకు బలవంతంగా ఎనలైజర్ టెస్టు […]
BY sarvi29 May 2015 6:43 PM IST
X
sarvi Updated On: 30 May 2015 7:23 AM IST
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు వింత అనుభవం ఎదరురయ్యింది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు మంజు అనే మహిళా వైద్యురాలు చుక్కలు చూపించింది. వాహనాలు సోదాలు చేస్తున్న సమయంలో డాక్టర్ మంజు వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నించగా అందుకు మంజు నిరాకరించారు. దాదాపు అరగంట పాటు నానా హంగామా సృష్టించారు. చివరకు బలవంతంగా ఎనలైజర్ టెస్టు చేయగా మంజు మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు.
గులాబీలిచ్చి విజ్ఞప్తి చేసిన పోలీసులు
ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోవాలంటూ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు నగర పోలీసులు. కేవలం విజ్ఞప్తి చెయ్యడంతో ఆగక గాంధీగిరి తరహాలో వారికి గులాబీపూలు కూడా అందజేశారు. ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులను కలుసుకున్నారు.
Next Story