అభివృద్ధి ఎవరు చేశారో గ్రేటరే చెబుతుంది: చంద్రబాబు
దమ్ముంటే గ్రేటర్ హైదరాబాద్’ ఎన్నికలు నిర్వహించండి. హైదరాబాద్ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే తేలుస్తారు’’ అని చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేంద్ర కమిటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వడానికి ముందు మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ 17 ఏళ్లు కాలయాపన చేస్తే ఎన్టీఆర్ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పాలకులు […]
BY sarvi29 May 2015 1:12 PM GMT
X
sarvi Updated On: 30 May 2015 2:30 AM GMT
దమ్ముంటే గ్రేటర్ హైదరాబాద్’ ఎన్నికలు నిర్వహించండి. హైదరాబాద్ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే తేలుస్తారు’’ అని చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేంద్ర కమిటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వడానికి ముందు మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ 17 ఏళ్లు కాలయాపన చేస్తే ఎన్టీఆర్ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పాలకులు ఎన్నికలు నిర్వహించకుండా అధికారులతో పాలన చేయించేందుకు ప్రయత్నిస్తే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ బాటలోనే టీఆర్‌ఎస్ పార్టీ సాగుతోందని విమర్శించారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన సమస్యల పరిష్కారానికి జూన్ 2 లోగా ఇద్దరం కూర్చుందాం.. మాట్లాడుకుందాం. పరిష్కారం కాకుంటే పెద్దమనుషులతో మాట్లాడుదాం. అదీ కుదరదంటే కేంద్రం వద్దకు వెళదాం’ అని చంద్రబాబు సూచించారు. కొట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని, కోర్టులకెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా శుక్రవారం ఎన్నికైన అనంతరం మహానాడు వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలూ కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని, ఇందుకు తెలంగాణ కూడా ముందుకు రావాలని కోరారు.
Next Story