ఆనం వివేకాకు సి.కళ్యాణ్ సవాల్
‘‘వివేకా నాతో పెట్టుకుంటే మసైపోతావు. నువ్వు బయటకు రావాలంటే మంది కావాలి. నేను ఒక్కడినే వస్తా. ఏ సెంటర్‌కైనా వస్తా. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో బస్తీ మే సవాల్ కొట్టుకుందాం రా’’ అంటూ.. సి.కళ్యాణ్ సవాల్ విసిరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేష్టలపై ‘రంభతో లాలికాడు’ సినిమా తీసే ఆలోచనుందని.. సినీ నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను కొనుగోలు చేసిన స్థలంలో భాగం ఇవ్వలేదన్న […]
BY Pragnadhar Reddy29 May 2015 8:10 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 30 May 2015 3:54 AM GMT
‘‘వివేకా నాతో పెట్టుకుంటే మసైపోతావు. నువ్వు బయటకు రావాలంటే మంది కావాలి. నేను ఒక్కడినే వస్తా. ఏ సెంటర్‌కైనా వస్తా. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో బస్తీ మే సవాల్ కొట్టుకుందాం రా’’ అంటూ.. సి.కళ్యాణ్ సవాల్ విసిరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేష్టలపై ‘రంభతో లాలికాడు’ సినిమా తీసే ఆలోచనుందని.. సినీ నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను కొనుగోలు చేసిన స్థలంలో భాగం ఇవ్వలేదన్న కారణంతో ఆ స్థలం వక్ఫ్‌బోర్డుకు చెందినదంటూ.. వివేకా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, కారుకూతలు కూస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు రామ్‌నగర్‌లో 2008లో మక్సూద్ ఆలీ అనే వ్యక్తి వద్ద తాను రూ.1.60 కోట్లకు స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆనాటి మేయర్ భానుశ్రీకి 100 అంకణాల స్థలాన్ని తాను నజరానా ఇస్తున్నట్లు ఓ పత్రికలో కథనం వచ్చిందని.. అప్పుడు దీన్ని ఖండించానని.. ఆ భూమిని తనకివ్వాలని వివేకా ప్రాధేయపడ్డారని గుర్తు చేశారు. ఆయన సెల్‌ఫోన్‌లో ఎప్పుడూ ఆయన డ్రీమ్ గర్ల్ ఫొటో ఉంటుందని, మొబైల్లో ఎటువంటి బొమ్మలు వస్తాయో అందరికి తెలుసని కళ్యాణ్ విమర్శించారు. ఈ వంద అంకణాల స్థలం ఆయనకు ఇవ్వనందుకే ఈ రోజు అది.. మైనారిటీల స్థలంగా మారిందా..? అని కల్యాణ్ ప్రశ్నించారు. వివేకానందరెడ్డికి ఏదో దెయ్యం పట్టిందన్నారు. తన స్థలాన్ని కొనుగోలు చేసిన మల్లికార్జున్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.
Next Story