Telugu Global
Others

తిరుపతి ప్రధాన కేంద్రంగా అగ్రిసెట్‌

వ్యవసాయ పాలిటెక్నిక్‌ చదువుకున్న విద్యార్థులు అగ్రికల్చర్‌ బీఎస్సీ కోర్సులో చేరడానికి రాసే ప్రవేశ పరీక్ష అగ్రిసెట్‌-2015ను తిరుపతి ప్రధాన కేంద్రంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిసెట్‌ను హైదరాబాదు కేంద్రంగానే నిర్వహించేవారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా అగ్రిసెట్‌ నిర్వహించాల్సి రావడంతో ఏపీకి తిరుపతిని కేంద్రంగా చేశారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలో దీనికి సంబంధించిన వివరాలను అగ్రిసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎ.గిరిధర్‌కృష్ణ తెలియజేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను విద్యార్థులు […]

వ్యవసాయ పాలిటెక్నిక్‌ చదువుకున్న విద్యార్థులు అగ్రికల్చర్‌ బీఎస్సీ కోర్సులో చేరడానికి రాసే ప్రవేశ పరీక్ష అగ్రిసెట్‌-2015ను తిరుపతి ప్రధాన కేంద్రంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిసెట్‌ను హైదరాబాదు కేంద్రంగానే నిర్వహించేవారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా అగ్రిసెట్‌ నిర్వహించాల్సి రావడంతో ఏపీకి తిరుపతిని కేంద్రంగా చేశారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలో దీనికి సంబంధించిన వివరాలను అగ్రిసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎ.గిరిధర్‌కృష్ణ తెలియజేశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్‌ 18వ తేదీలోపు అందజేయాలన్నారు. ఆ తర్వాత 22 నుంచి 27 తేదీవరకు అపరాధ రుసుంతో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్రం మొత్తం మీద అగ్రికల్చర్‌ బీఎస్సీ సీట్లు 67 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో 61సీట్లు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, మరో ఆరు సీడ్‌ టెక్నాలజీకి కేటాయించడం జరిగిందన్నారు. అందువల్ల 13జిల్లాల నుంచి 1,200మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జూలై ఐదో తేదీన అగ్రిసెట్‌ను చిత్తూరు జిల్లాలోని తిరుపతి, గుంటూరు జిల్లాలోని బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తామన్నారు.
First Published:  29 May 2015 6:40 PM IST
Next Story