బీచ్‌లో 24 గంటలైనా ఆచూకీ దొరకని మృతదేహాలు
విశాఖ జిల్లాలో గురువారం ఏర్పడిన విషాదానికి ఇంకా తెర పడలేదు. బీచ్‌లో గల్లంతయిన ముగ్గురిలో ఇద్దరు మాత్రమే శవాలై బయట పడ్డారు. వీరిని లోకేష్, రాజులుగా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది రెండు పడవల్లో నిన్నటి నుంచి వెదుకుతున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులు సముద్రం వద్దే పడిగాపులు గాస్తున్నారు. అరిలోవకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎండ తాళలేక సముద్రంలో ఈతకు వెళ్ళారు. జోడుగుళ్ళపాలెం బీచ్ వద్ద వారు స్నానం చేసే ప్రయత్నం చేశారు. […]
BY sarvi28 May 2015 6:42 PM IST
sarvi Updated On: 29 May 2015 7:08 AM IST
విశాఖ జిల్లాలో గురువారం ఏర్పడిన విషాదానికి ఇంకా తెర పడలేదు. బీచ్‌లో గల్లంతయిన ముగ్గురిలో ఇద్దరు మాత్రమే శవాలై బయట పడ్డారు. వీరిని లోకేష్, రాజులుగా గుర్తించారు. మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది రెండు పడవల్లో నిన్నటి నుంచి వెదుకుతున్నప్పటికీ ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులు సముద్రం వద్దే పడిగాపులు గాస్తున్నారు. అరిలోవకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎండ తాళలేక సముద్రంలో ఈతకు వెళ్ళారు. జోడుగుళ్ళపాలెం బీచ్ వద్ద వారు స్నానం చేసే ప్రయత్నం చేశారు. ఈ లోగా పక్కనే ఉన్న మత్స్యకారులు ఈ ప్రాంతంలో దిగవద్దని, ఇది ప్రమాద కరమైన ప్రాంతమని చెప్పడంతో కొంతమంది తటపటాయిస్తూ ఒడ్డునే ఉండిపోయారు. అయితే వీరిలో ఓ ఐదుగురు మాత్రం సముద్రంలోకి దిగి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం మొదలెట్టారు. అకస్మాత్తుగా వచ్చిన ఓ రాక్షస అల ఈ ఐదుగురిని లోపలికి తీసుకుపోయే ప్రయత్నం చేసింది. పక్కనే ఉన్న మత్స్యకారులు వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి సముద్రంలోకి దిగి ఇద్దర్ని రక్షించగలిగారు. మరో ముగ్గుర్ని రక్షించే ప్రయత్నం చేస్తుండగా వీరు కూడా ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. వెంటనే వీరు వెనక్కి రావడంతో ఆ ముగ్గురి జాడ తెలియకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే గత ఈతగాళ్ళను రప్పించి రెండు పడవల్లో గాలింపు చర్యలు చేపట్టినట్టు మెరైన్ డీఎస్పీ నర్సింగరావు చెప్పారు. గల్లంతైన వారిని లోకేష్, రాజు, విజయ్‌లుగా గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు.
Next Story