Telugu Global
Others

నేను రాజకీయాల్లోకి రాను: ప్రియాంక

క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తల్లి సోనియాతో కలిసి రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ప్రియాంకను స్థానిక కార్పొరేటర్‌ ధర్మేంద్ర ద్వివేది.. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరారు. దీనికి ప్రియాంక నవ్వుతూ..‘‘ నన్ను ఇక్కడే (రాయ్‌బరేలీ) ఉండనివ్వండి, ఇత‌ర ప్రాంతాలకు ఎందుకు పంపించాలనుకుంటున్నారు.’’ అన్నారు. ఇందిర హావభావాలున్న ప్రియాంకను పార్టీలో కీలక స్థానాన్ని అప్పగిస్తే పార్టీకి అనుకూలిస్తుందని చాలామంది కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆమె […]

నేను రాజకీయాల్లోకి రాను: ప్రియాంక
X
క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తల్లి సోనియాతో కలిసి రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ప్రియాంకను స్థానిక కార్పొరేటర్‌ ధర్మేంద్ర ద్వివేది.. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరారు. దీనికి ప్రియాంక నవ్వుతూ..‘‘ నన్ను ఇక్కడే (రాయ్‌బరేలీ) ఉండనివ్వండి, ఇత‌ర ప్రాంతాలకు ఎందుకు పంపించాలనుకుంటున్నారు.’’ అన్నారు. ఇందిర హావభావాలున్న ప్రియాంకను పార్టీలో కీలక స్థానాన్ని అప్పగిస్తే పార్టీకి అనుకూలిస్తుందని చాలామంది కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆమె రాక‌ను రాహుల్ అంటే ఇష్ట‌ప‌డని వారితోపాటు, ఇందిరాగాంధీపై అభిమాన‌మున్న సీనియ‌ర్ నాయ‌కులు సైతం ఆహ్వానిస్తున్నారు. అయినా ప్రియాంక స‌సేమిరా అంటున్నారు. త‌న‌కు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇష్టం లేద‌ని చెబుతూ ఎప్ప‌టిక‌ప్పుడు సున్నితంగా తిరస్కరించారు.
First Published:  29 May 2015 9:42 AM IST
Next Story