Telugu Global
Others

టీడీపీ నేత ఇంట్లోంచే రూ.15 కోట్ల‌ విగ్ర‌హం స్వాధీనం!

నెల్లూరు జిల్లాలో పోయిన విగ్ర‌హం చిత్తూరు జిల్లా పాకాల‌కు చేరి ఆత‌ర్వాత పోలీసుల పుణ్య‌మాని గుంటూరు చేరింది. ఇలా మూడు జిల్లాల్లో తిరిగిన ఈ విగ్ర‌హం క‌థ వెనుక చాలా ఆస‌క్తి కలిగించే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఇపుడు పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్టు చెబుతున్న శ్రీమేధ దక్షిణా మూర్తి విగ్రహం చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన టీడీపీ నేత, సింగిల్‌ విండ్‌ వైస్‌చైర్మన్‌ మర్యాద చంద్ర అలియాస్‌ చంద్రశేఖర్‌నాయుడు ఇంట్లో ఈనెల 22నే లభించినట్లు సమాచారం. […]

టీడీపీ నేత ఇంట్లోంచే రూ.15 కోట్ల‌ విగ్ర‌హం స్వాధీనం!
X
నెల్లూరు జిల్లాలో పోయిన విగ్ర‌హం చిత్తూరు జిల్లా పాకాల‌కు చేరి ఆత‌ర్వాత పోలీసుల పుణ్య‌మాని గుంటూరు చేరింది. ఇలా మూడు జిల్లాల్లో తిరిగిన ఈ విగ్ర‌హం క‌థ వెనుక చాలా ఆస‌క్తి కలిగించే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఇపుడు పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్టు చెబుతున్న శ్రీమేధ దక్షిణా మూర్తి విగ్రహం చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన టీడీపీ నేత, సింగిల్‌ విండ్‌ వైస్‌చైర్మన్‌ మర్యాద చంద్ర అలియాస్‌ చంద్రశేఖర్‌నాయుడు ఇంట్లో ఈనెల 22నే లభించినట్లు సమాచారం. అయితే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో చోరీకి గురైన శ్రీ‌మేథ ద‌క్షిణామూర్తి పంచ‌లోహ విగ్ర‌హం గురువార‌మే స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా 12 మంది నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు, వారి నుంచి ఓ కారు, విగ్ర‌హాల్ని క‌రిగించే సామ‌గ్రిని కూడా స్వాధీన‌ప‌రుచుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఇది 1760 సంవ‌త్స‌రం నాటిద‌ని, దీని విలువ రూ. 15 కోట్లు పైగా ఉంటుంద‌ని వారు చెప్పారు. 75 కిలోల ఈ విగ్ర‌హాన్ని గ‌త నెలలో దొంగ‌లు ఎత్తుకుపోయారు. ఇంత విలువైన విగ్ర‌హం కాబ‌ట్టే దీనిపై రాజ‌కీయ నాయ‌కుల క‌న్ను ప‌డింది. నిజంగా ఇది చోరీకి గురైందా… లేక ఎవ‌రైనా చోరీ చేయించారా… అనే విష‌యం పోలీసులు చెప్పాల్సి ఉంది. అయితే విగ్ర‌హం చోరీ కేసులో చంద్రశేఖర్‌ నాయుడు కుమారుడు శ్రీకాంత్‌ నాయుడుని నిందితుడిగా గుంటూరు పోలీసులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. అత‌న్ని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. అంత‌క‌న్నా ముందే శ్రీ‌కాంత్ త‌ల్లిదండ్రులైన చంద్రశేఖర్‌నాయుడు ఆయన సతీమణి శాంతమ్మను పోలీసులు విచారించారు. ఈ విచార‌ణ‌లో వారి ఇంటిలోనే విగ్ర‌హం దాచి ఉంచిన వైనం తెలిసింది. ఈ విగ్రహాన్ని పక్కా ప్రణాళికతో ఎస్సై వీరేంద్ర బాబు సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకుని గుంటూరు ఐజీ కార్యాలయానికి తరలించిన‌ట్టు తెలిసింది. ఈ విగ్ర‌హాన్ని ఎత్తుకుపోయిన దొంగ‌ల్ని ప‌ట్టుకున్నారు కాబ‌ట్టి అస‌లు నిజాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. వీటిని పోలీసులు ఎంత‌వ‌ర‌కు బ‌య‌ట పెడ‌తార‌న్న‌ది వేచి చూడాలి.
First Published:  29 May 2015 12:10 PM IST
Next Story