Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 97

ఒక స్టూడెంట్‌ తల్లి టీచర్‌కి ఉత్తరం పంపింది “మేడమ్‌! కిరణ్‌వాళ్ళ నాన్న జ్వరంతో ఉన్నారు. చాలా నీరసించి ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి వారం రోజులు పట్టవచ్చు. దయచేసి అంతవరకు హోంవర్కు ఇవ్వరని ఆశిస్తున్నాను”. ————————————- అతనికి భార్య అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నీరసపడిపోతుందని విపరీతంగా అల్లాడిపోయేవాడు. ఆమె ఆరోగ్యం కోసం అతిజాగ్రత్త తీసుకునేవాడు. రోజూ ఒక టాబ్లెట్‌ తీసుకోమని ఒక ఐరన్‌ టాబ్లెట్స్‌ బాటిల్‌ తెచ్చిచ్చాడు. మూడురోజుల తరవాత ఆమె సింకు దగ్గర నిల్చుని […]

ఒక స్టూడెంట్‌ తల్లి టీచర్‌కి ఉత్తరం పంపింది “మేడమ్‌! కిరణ్‌వాళ్ళ నాన్న జ్వరంతో ఉన్నారు. చాలా నీరసించి ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి వారం రోజులు పట్టవచ్చు. దయచేసి అంతవరకు హోంవర్కు ఇవ్వరని ఆశిస్తున్నాను”.
————————————-
అతనికి భార్య అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నీరసపడిపోతుందని విపరీతంగా అల్లాడిపోయేవాడు. ఆమె ఆరోగ్యం కోసం అతిజాగ్రత్త తీసుకునేవాడు. రోజూ ఒక టాబ్లెట్‌ తీసుకోమని ఒక ఐరన్‌ టాబ్లెట్స్‌ బాటిల్‌ తెచ్చిచ్చాడు. మూడురోజుల తరవాత ఆమె సింకు దగ్గర నిల్చుని పాత్రలు కడుగుతూ ఉంటే “చేతులు చాలాసేపు నీళ్ళలో తడవనీకు. తుప్పు పడతాయేమో” అని హెచ్చరించాడు.
————————————-
ఒక ఫాదర్‌ పెళ్ళి జరిపిస్తున్నాడు. ఆచారం ప్రకారం పెళ్ళి జరిపించాక అక్కడ ఉన్న (చర్చిలో ఉన్న) అందర్నీ చూసి “ఈ పెళ్ళికి అభ్యంతరం చెప్పేవాళ్ళు ఇక్కడెవరయినా ఉన్నారా?” అని అడిగాడు. సన్నగొంతుతో పెళ్ళికొడుకు “నేనున్నాను” అన్నాడు. ఫాదర్‌ “నీ సాక్ష్యం అక్కర్లేదు. నువ్వు పెళ్ళి కొడుకువి. ఊరుకో” అన్నాడు.
————————————-

సుప్రసిద్ధ హాలివుడ్‌ నటి యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమెను స్మశానానికి తీసుకొచ్చారు. పూడ్చి పెట్టడం జరిగాక అభిమానులు అక్కడున్న కవిని ఒక్క వాక్యం ఆమె గురించి చెప్పమన్నారు.
కవి “మొత్తానికి చివరికి ఆమె ఒంటరిగా నిద్రిస్తోంది” అన్నాడు.

First Published:  28 May 2015 6:33 PM IST
Next Story