కూతుర్ని కాటేసిన కామం
కామం కళ్ళని కప్పేసింది. కనురెప్పలా చూసుకోవలసిన బిడ్డను కాటేసింది. రాజస్థాన్‌లోని 16 ఏళ్ల కూతురిపై ఆమె కన్న తండ్రి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. దీన్ని తట్టుకోలేని ఆ యువతి తన తల్లికి, అన్నకి విషయాన్ని చెప్పింది. ఎందుకో వారూ ఉదాసీనంగా ఉండిపోయారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్‌కుమార్ తాను ఇంట్లో ఒంటరిగా కనపడినప్పుడల్లా అత్యాచారం చేస్తున్నాడని, తల్లి, అన్నకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికైనా […]
BY sarvi29 May 2015 10:46 AM IST
X
sarvi Updated On: 29 May 2015 10:46 AM IST
కామం కళ్ళని కప్పేసింది. కనురెప్పలా చూసుకోవలసిన బిడ్డను కాటేసింది. రాజస్థాన్‌లోని 16 ఏళ్ల కూతురిపై ఆమె కన్న తండ్రి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. దీన్ని తట్టుకోలేని ఆ యువతి తన తల్లికి, అన్నకి విషయాన్ని చెప్పింది. ఎందుకో వారూ ఉదాసీనంగా ఉండిపోయారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్‌కుమార్ తాను ఇంట్లో ఒంటరిగా కనపడినప్పుడల్లా అత్యాచారం చేస్తున్నాడని, తల్లి, అన్నకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని తన తండ్రి బెదిరించినట్లు పదోతరగతి చదువుతూ మధ్యలో ఆపేసిన ఆ అమ్మాయి చెప్పింది. ఆమెను వైద్యపరీక్షలకు పంపి, నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ వద్ద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశామని పోలీసులు తెలిపారు. ఇంత నేరం జరుగుతున్నా అడ్డు చెప్పనందుకు బాధితురాలి అమ్మ, అన్నలపై కూడా కేసులు పెట్టారు.
Next Story