Telugu Global
Cinema & Entertainment

అనుష్క ని వదిలేసిన సూర్య..

సూర్య- అనుష్క కాంబినేషన్ లో వచ్చిన యముడు(సింగం) సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ హరి ఈ సినిమాను అంత ఎమోషనల్ గా తీసాడు. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా సింగం2 రిలీజ్ చేసారు. కాని మొదటి పార్ట్ సాధించిన విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక ఈ రెండు పార్టు లలో కూడా అనుష్క నే హీరోయిన్. ఇక ఈ సినిమాకు మూడో సీక్వెల్ తీయడానికి కూడా […]

అనుష్క ని వదిలేసిన సూర్య..
X

సూర్య- అనుష్క కాంబినేషన్ లో వచ్చిన యముడు(సింగం) సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ హరి ఈ సినిమాను అంత ఎమోషనల్ గా తీసాడు. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా సింగం2 రిలీజ్ చేసారు. కాని మొదటి పార్ట్ సాధించిన విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక ఈ రెండు పార్టు లలో కూడా అనుష్క నే హీరోయిన్. ఇక ఈ సినిమాకు మూడో సీక్వెల్ తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట.

కాని ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రీసెంట్ గా సూర్య తో కలిసి సికిందర్ సినిమాలో మొదటి సారి నటించిన సమంత, సూర్య ని బాగా ఆకట్టుకుందట. అందుకే సింగం 3 లో సమంత కే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. కాకపోతే అనుష్క ని ఎదో ఒక రోల్ లో ఉంచేసి మెయిన్ రోల్ ని సమంత కి ఉండేలా కూడా డైరెక్టర్ మరో ప్లాన్ చేస్తున్నాడట. ఏదైనా సింగం అంటేనే సూర్య- అనుష్క లు, ఇక వీరిద్దరూ లేకుండా సింగం3 అంటే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి..!

First Published:  29 May 2015 2:00 PM IST
Next Story