ఆల్ ఈజ్ వెల్ అంటున్న హీరోయిన్..
హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ఆదా శర్మ. మాములుగా పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఆ తర్వాత ఈమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుంది ఎవరికైనా. కాని ఆదా పరిస్తితి మాత్రం డల్ అయ్యింది. ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది, ఇక ఈ రోజు ఉదయం ఒక న్యూస్ అందరిలో కలకలం రేపింది. షూటింగ్ సమయంలో ఆదా శర్మ కి బైక్ యాక్సిడెంట్ అయ్యిందని. బైక్ అదుపు తప్పి […]
హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ఆదా శర్మ. మాములుగా పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఆ తర్వాత ఈమె కెరీర్ ఒక రేంజ్ లో ఉంటుంది ఎవరికైనా. కాని ఆదా పరిస్తితి మాత్రం డల్ అయ్యింది. ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది, ఇక ఈ రోజు ఉదయం ఒక న్యూస్ అందరిలో కలకలం రేపింది.
షూటింగ్ సమయంలో ఆదా శర్మ కి బైక్ యాక్సిడెంట్ అయ్యిందని. బైక్ అదుపు తప్పి పడిపోయింది అని, అటు వెనకాల నుండి వస్తున్న బస్సు తగిలి, తీవ్ర గాయలై ఆసుపత్రి లో జాయిన్ అయ్యిందనే న్యూస్ బయటకి వచ్చింది. అది చూసిన ఆదా శర్మ వెంటనే ‘ ప్రమాదం లేదు, ఏమీ లేదు.. హైద్రాబాద్‌లో చాలా వేడిగా వుంది. కాస్త జ్వరం వచ్చిందంతే. నేను హ్యాపీగానే వున్నా’ అంటూ ట్వీట్ చేసింది. దానితో సినీ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకునాయి. ఏది ఏమైనా పొద్దున్నే తన గురించి ఇలాంటి న్యూస్ రావడం ఆదాకి పెద్ద షాక్ లాంటిదే..!