రూ.30 లక్షల ఎర్రచందనం స్వాధీనం-స్మగ్లర్ల అరెస్ట్
కడప జిల్లాలోని సిద్ధవటం మండలం భాకరాపేట దగ్గర రూ.30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో బడా స్మగ్లర్ వెంకటసుబ్బయ్య హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడుకు చెందిన 74 మంది ఎర్రచందనం కూలీలు ఓ ప్రైవేటు బస్సులో వస్తుండగా కడప జిల్లా చిన్నమండెం దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ అనంతరం కూడా వెల్లూరుకు చెందిన కూలీలు టూరిస్టు బస్సుల్లో […]
BY Pragnadhar Reddy28 May 2015 1:07 PM GMT
Pragnadhar Reddy Updated On: 28 May 2015 11:50 PM GMT
కడప జిల్లాలోని సిద్ధవటం మండలం భాకరాపేట దగ్గర రూ.30 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసులో బడా స్మగ్లర్ వెంకటసుబ్బయ్య హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా తమిళనాడుకు చెందిన 74 మంది ఎర్రచందనం కూలీలు ఓ ప్రైవేటు బస్సులో వస్తుండగా కడప జిల్లా చిన్నమండెం దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్ అనంతరం కూడా వెల్లూరుకు చెందిన కూలీలు టూరిస్టు బస్సుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు కడప జిల్లాకు రావడం విశేషం. ఎవరు పంపితే వీరు చెట్లను నరికేందుకు వస్తున్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కూలీలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా గురువారం చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
Next Story