పోలీసులు... కొండ నాలిక్కి మందేస్తే...
కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టయ్యింది కొంత మంది పోలీసుల పరిస్థితి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర ఆరోపణల మీద ఏడాది కాలంగా ఆగ్రా పరిధిలోని ఖండోలీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సస్పెన్షన్లు, బదిలీలు వెంటాడుతున్నాయి. దీంతో హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక యాగం చెయ్యాలని రెండు రోజుల కిందట ఈ స్టేషన్ సిబ్బంది నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇక్కడి పోలీసులందరూ ఫైళ్లు, ఆయుధాలు పక్కన పెట్టేసి… సరిగ్గా చెప్పాలంటే వాళ్ల ప్రధాన కర్తవ్యమైన […]
BY sarvi28 May 2015 11:43 AM IST
X
sarvi Updated On: 28 May 2015 11:56 AM IST
కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టయ్యింది కొంత మంది పోలీసుల పరిస్థితి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర ఆరోపణల మీద ఏడాది కాలంగా ఆగ్రా పరిధిలోని ఖండోలీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సస్పెన్షన్లు, బదిలీలు వెంటాడుతున్నాయి. దీంతో హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక యాగం చెయ్యాలని రెండు రోజుల కిందట ఈ స్టేషన్ సిబ్బంది నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇక్కడి పోలీసులందరూ ఫైళ్లు, ఆయుధాలు పక్కన పెట్టేసి… సరిగ్గా చెప్పాలంటే వాళ్ల ప్రధాన కర్తవ్యమైన ప్రజా రక్షణ విధుల్ని గాలికొదిలేసి… స్టేషన్ ఆవరణలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ అధికారిక నివాసంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. భగవంతుడా దొంగతనాలు జరగకుండా చూడు… మా ఉద్యోగాలు కాపాడు తండ్రీ అంటూ పోలీసులు యాగం చేస్తుంటే… సరిగ్గా అప్పుడే ఆ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఆయుధాలతో దిగారు ఐదుగురు దొపిడీ దొంగలు. బ్యాంక్ నుంచి 50 వేల రూపాయలతో అటుగా వెళుతున్న సోన్‌పాల్ సింగ్ అనే వ్యక్తిని దోచుకుని వెళ్లిపోయారు. దొంగలు బాబోయ్ అంటూ బాధితుడు గగ్గోలు పెట్టి అరిచినా యాగంలో మైమరచిపోయి ఉన్న పోలీసులకు ఏమీ వినిపించలేదు. చివరికి అటుగా వెళుతున్న మరికొందరు వ్యక్తులు స్టేషన్‌లోకి వచ్చి జరిగింది చెబితే.. ఒక ఇనస్పెక్టర్ మాత్రం ఆరా తియ్యడానికి ఆదరాబాదరాగా బయటికొచ్చారు. అప్పటికే దొంగలు పారిపోయారు. గడచిన ఏడాది కాలంగా ఈ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు, సబ్-ఇనస్పెక్టర్లు డజను మందికి పైగా రకరకాల ఆరోపణలపై సస్పెన్షన్లు, బదిలీలకు గురయ్యారు. దీంతో తమ సార్ కలత చెంది ఈ యాగం ప్లాన్ చేశారని కానిస్టేబుల్ ఒకరు చెప్పారు. ఈ సంఘటన గురించి పైఅధికారులకు తెలిస్తే ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న వారు కాకుండా ఇంకెవరు క్రమశిక్షణ చర్యలకు బలైపోతామోనని భయపడి చస్తున్నారు పోలీసులు.
Next Story