Telugu Global
Others

మహానాడులో కార్యకర్త మృతి... 46 మందికి వడదెబ్బ

మహానాడు మొదటిరోజే విషాదం! ఓ కార్యకర్త గుండెపోటుతో ప్రాంగణంలో కుప్పకూలిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన చెన్నయ్య అనే కార్యకర్త గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతణ్ని వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే మరణించాడు. చెన్నయ్య మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. కాగా.. మహానాడుకు హాజరైన వారిలో మొత్తం 46 మందికి వడదెబ్బ తగిలింది. మండుతున్న ఎండలు.. వడగాడ్పుల నేపథ్యంలో తక్కువ మంది ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు భావించినప్పటికీ వేలాదిగా […]

మహానాడు మొదటిరోజే విషాదం! ఓ కార్యకర్త గుండెపోటుతో ప్రాంగణంలో కుప్పకూలిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన చెన్నయ్య అనే కార్యకర్త గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతణ్ని వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే మరణించాడు. చెన్నయ్య మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. కాగా.. మహానాడుకు హాజరైన వారిలో మొత్తం 46 మందికి వడదెబ్బ తగిలింది. మండుతున్న ఎండలు.. వడగాడ్పుల నేపథ్యంలో తక్కువ మంది ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు భావించినప్పటికీ వేలాదిగా ప్రతినిధులు తరలిరావడంతో ప్రధాన ద్వారం కిక్కిరిసిపోయింది. వచ్చిన ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా సమావేశ మందిరంలో కుర్చీలు వేయకపోవడం మరో సమస్య ఎదురైంది. మధ్యాహ్న భోజన విరామం కోసం బయటకు వెళ్లిన ప్రతినిధులకు మళ్లీ లోపల స్థలం దొరకలేదు. మీడియా ప్రతినిధులకూ ఇదే పరిస్ధితి ఎదురైంది. సభా ప్రాంగణంలో ఉన్నవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం అందినా అక్కడ స్థలం లేక దూరంగా ఉండిపోయిన వారికి మాత్రం అవి దొరకలేదు. ఎండ వేడిమికి వారు బాగా ఇబ్బంది పడ్డారు.
First Published:  27 May 2015 6:34 PM IST
Next Story