ప్రత్యేక హోదా లేనట్టే: జెసీ
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన కేంద్రానికి లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులందరి మాదిరిగానే మోడీ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఒక ప్యాషనై పోయిందని, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే మోడీ కూడా మాట్లాడారని, వాళ్లు హోదా ఇవ్వడానికి ఏ రకంగాను సిద్ధంగా లేరని కుండబద్దలు కొట్టారు. కానీ ముఖ్యమంత్రి కృషి వల్ల ఆర్థిక సహాయం వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ ఎలా ఉందన్న ప్రశ్నకు […]
BY Pragnadhar Reddy28 May 2015 6:00 PM IST
X
Pragnadhar Reddy Updated On: 28 May 2015 6:27 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన కేంద్రానికి లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులందరి మాదిరిగానే మోడీ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఒక ప్యాషనై పోయిందని, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే మోడీ కూడా మాట్లాడారని, వాళ్లు హోదా ఇవ్వడానికి ఏ రకంగాను సిద్ధంగా లేరని కుండబద్దలు కొట్టారు. కానీ ముఖ్యమంత్రి కృషి వల్ల ఆర్థిక సహాయం వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. జగన్ దీక్షలను ప్రజలు నమ్మరని జేసీ అన్నారు. జగన్ చేసేది ఏమి లేదని జేపీ పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుండి జెండా మోసిన కార్యకర్తలకు ఇబ్బందిగా ఉందని, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంటూ అల్లాడుతున్నారన్నారు.
Next Story