హైదరాబాద్ భద్రతపై పోలీసుల డేగ కన్ను!
హైదరాబాద్ నగరాన్ని డేగ కన్నులు కాపలా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు సిటీ పోలీసులు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కారిడార్‌లో నిఘాను మరింత పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం హోం శాఖ నుంచి నిధులు కూడా మంజూరవడంతో నిఘా నేత్రాలను మోహరించాలని పోలీసు బాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో రూ. ఐదు కోట్లతో ఐదంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీసీ ఆనంద్ తెలిపారు. ఐటీ కారిడార్ పరిధిలో మరో 85 […]
BY sarvi28 May 2015 9:18 AM IST
X
sarvi Updated On: 28 May 2015 9:18 AM IST
హైదరాబాద్ నగరాన్ని డేగ కన్నులు కాపలా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు సిటీ పోలీసులు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కారిడార్‌లో నిఘాను మరింత పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం హోం శాఖ నుంచి నిధులు కూడా మంజూరవడంతో నిఘా నేత్రాలను మోహరించాలని పోలీసు బాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో రూ. ఐదు కోట్లతో ఐదంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీసీ ఆనంద్ తెలిపారు. ఐటీ కారిడార్ పరిధిలో మరో 85 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అలాగే బాలానగర్ పరిధిలో 1.34 కోట్లతో 275 సీసీ కెమెరాలు, సైబరాబాద్ పరిధిలో 44 పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఇంకా నగరంలోని వెయ్యి జంక్షన్‌లు, 10 హై వే లలో రూ. 50 కోట్లతో వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నగరంలోకి అపరిచిత వ్యక్తుల రాకపోకలు పెరుగుతున్న దృష్ట్యా పోలీసు బందోబస్తు ఉన్నా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని ఆనంద్ పేర్కొన్నారు. గృహాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
Next Story