ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: హరికృష్ణ
మాజీముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఆయన ఆశయాలను సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు […]
BY Pragnadhar Reddy27 May 2015 6:37 PM IST

X
Pragnadhar Reddy Updated On: 28 May 2015 3:24 AM IST
మాజీముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఆయన ఆశయాలను సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వీరితోపాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
Next Story