పండగ చేస్కో చిత్రం విడుదల అవుతుందా..?
ప్రచారం అనేది సినిమాకు ప్రాణం. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు. అయితే ఈ ప్రచారం చేసుకునే విధానంలో నిర్మాతలకు ..మీడియాకు సరైన సమన్వయం లేక పోతే ఎలా వుంటుందో చెప్పడానికి శుక్రవారం రిలీజ్ అవుతున్న రామ్ చిత్రమే ఒక ఎగ్జాంపుల్. దిల్ రాజ్ నాయకత్వంలో కొందురు నిర్మాతలు సిండికేట్ గా వ్యవహారిస్తూ..తమకు నచ్చిన రెండు ఛానెల్స్ కు మాత్రమే యాడ్స్ ఇచ్చుకోవడంతో… గత కొంత కాలం నుంచి శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల సమాచారమే ప్రేక్షకులకు […]
ప్రచారం అనేది సినిమాకు ప్రాణం. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు. అయితే ఈ ప్రచారం చేసుకునే విధానంలో నిర్మాతలకు ..మీడియాకు సరైన సమన్వయం లేక పోతే ఎలా వుంటుందో చెప్పడానికి శుక్రవారం రిలీజ్ అవుతున్న రామ్ చిత్రమే ఒక ఎగ్జాంపుల్. దిల్ రాజ్ నాయకత్వంలో కొందురు నిర్మాతలు సిండికేట్ గా వ్యవహారిస్తూ..తమకు నచ్చిన రెండు ఛానెల్స్ కు మాత్రమే యాడ్స్ ఇచ్చుకోవడంతో… గత కొంత కాలం నుంచి శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల సమాచారమే ప్రేక్షకులకు తెలియడం లేదు. కేవలం రెండు న్యూస్ ఛానెల్స్ కు ప్రకటనలు ఇస్తే.. వాటి కవరేజ్ ఎంతా.. ఎంత మందికి రీచ్ అవుతుంది. ఇది పెద్దగా ఉపయుక్తమైన చర్య కాదు.
20 చానెల్స్ చేసే ప్రచారానికి.. కేవలం రెండు న్యూస్ చానెల్స్ ను నమ్ముకునే పబ్లిసిటికి వ్యత్యాసం ఏమిటి అనేది ఇప్పటికే దిల్ రాజ్ కు దోచేయ్ చిత్రంతో అనుభవం లోకి వచ్చినప్పటికి మొండిగా వ్యవహారిస్తుండటం విశేషం. ఇక తాజాగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో యువ హీరో రామ్ చేసిన పండగ చేస్కో చిత్రం ప్రచారం పరంగా అంతంత మాత్రంగానే ఉంది. ఇదంతా దిల్ రాజ్ అండ్ కో నిర్వాహాకమే. ప్రచారం లేక పోతే నాశనం అయ్యేది డైరెక్ట్ గా బయ్యర్లే కావోచ్చు కానీ.. అల్టీమేట్ గా అందరికి ఎఫెక్ట్ అనేది మరవ కూడదు మరి.