Telugu Global
Others

టీడీపీకి కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు!

కేంద్ర కమిటీ ఏర్పాటు దిశగా తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసింది. పార్టీ నియమావళిలో తగు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటుపై పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణలను మహానాడులో ఆ పార్టీ నేత రవీంద్ర కార్యకర్తలకు వివరించారు. ఇప్పటి వరకూ పార్టీకి ఒకే రాష్ట్ర కమిటీ ఉండేదని, ఇప్పుడు రెండు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గండిపేటలో టిడిపి నిర్వహిస్తున్న 34వ మహానాడులో రెండో రోజు కేంద్ర కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ […]

టీడీపీకి కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు!
X
కేంద్ర కమిటీ ఏర్పాటు దిశగా తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసింది. పార్టీ నియమావళిలో తగు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటుపై పార్టీ రాజ్యాంగానికి చేసిన సవరణలను మహానాడులో ఆ పార్టీ నేత రవీంద్ర కార్యకర్తలకు వివరించారు. ఇప్పటి వరకూ పార్టీకి ఒకే రాష్ట్ర కమిటీ ఉండేదని, ఇప్పుడు రెండు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గండిపేటలో టిడిపి నిర్వహిస్తున్న 34వ మహానాడులో రెండో రోజు కేంద్ర కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చంద్రబాబు అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఆరు సెట్ల నామినేషన్ దాఖలయ్యాయి. అశోక్ గజపతి రాజు, యనమల, ఎర్రబెల్లి, రమణ, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, ప్రతిభా భారతిలు ఆరు సెట్ల‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కమిటీలను ఆయనే నియమించనున్నారు. వీటిపైన కేంద్ర కమిటీ ఉంటుందన్నారు. రాష్ట్ర పొలిట్‌బ్యూరోలతోపాటు కేంద్ర పొలిట్‌బ్యూరో కూడా ఉంటుందన్నారు. వచ్చే మహానాడును కేంద్ర కమిటీ ఏర్పాటు చేసేటట్లు సవరణ చేశామన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి సంబంధించి ప్రత్యేక నిబంధన పెట్టామన్నారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణకు మహానాడులో ప్రతినిధుల ఆమోదం తీసుకున్నారు. చంద్ర‌బాబు కేంద్ర క‌మిటీకి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యాక రెండు తెలుగు రాష్ట్రాల‌కు అధ్య‌క్షుల్ని ఎన్నుకునే అవ‌కాశం ఉంది.
First Published:  27 May 2015 7:02 PM IST
Next Story