తెలుగు ప్రజలందరికీ 'వెలుగు'లుండాలి: చంద్రబాబు
ఏపీలో 24 గంటలూ కరెంట్ ఇవ్వడం కోసం మూడు రాష్ర్టాలతో కేంద్రంతో ఒప్పందం చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ రాష్ట్రంలో రూ. 1500 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా కేంద్రం సహకరించేటట్లు ఒక ఒప్పందం చేసుకున్నామని దీనిపై ఎనర్జీ ఆడిటింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో ముందుకు పోయామని చంద్రబాబు వెల్లడించారు. నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ర్టాల్లో ఏపీ ఒకటని, ఈ రోజున ఏపీలో మిగులు విద్యుత్ ఉందని, తెలంగాణకు కరెంట్ […]
BY Pragnadhar Reddy27 May 2015 1:45 PM GMT
Pragnadhar Reddy Updated On: 28 May 2015 12:51 PM GMT
ఏపీలో 24 గంటలూ కరెంట్ ఇవ్వడం కోసం మూడు రాష్ర్టాలతో కేంద్రంతో ఒప్పందం చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ రాష్ట్రంలో రూ. 1500 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా కేంద్రం సహకరించేటట్లు ఒక ఒప్పందం చేసుకున్నామని దీనిపై ఎనర్జీ ఆడిటింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో ముందుకు పోయామని చంద్రబాబు వెల్లడించారు. నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ర్టాల్లో ఏపీ ఒకటని, ఈ రోజున ఏపీలో మిగులు విద్యుత్ ఉందని, తెలంగాణకు కరెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల్లో ఉండే తెలుగు ప్రజలు అన్ని విధాలా బాగుండాలనేది టీడీపీ ఆశయమని, దాని కోసమే ముందుకు పోతున్నామని చంద్రబాబు చెప్పారు. తక్కువ సమయంలోనే ఏపీలో విద్యుత్ సమస్యను అధిగమించామని, వచ్చే ఐదేళ్లలో 5030 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పతి చేయనున్నామని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ ఆదా చేసే విధంగా లక్ష ఎల్‌ఇడీ బల్బులను పంపిణి చేస్తామని ఆయన అన్నారు. 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారమని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
Next Story