కొత్త రాజధానికి పది వేల మంది కేంద్ర ఉద్యోగులు
58 ఎకరాలు కేటాయించమన్న హస్తిన రాజధానికి పది వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తరలి రానున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయం కోసం రాజధానిలో మొత్తం 58 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా క్యాపిటల్ రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రాజధానిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కింద నిర్వహించాలని, మొత్తం పది వేల మంది కేంద్ర […]
BY sarvi28 May 2015 12:24 PM IST
X
sarvi Updated On: 28 May 2015 12:27 PM IST
58 ఎకరాలు కేటాయించమన్న హస్తిన
రాజధానికి పది వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తరలి రానున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయం కోసం రాజధానిలో మొత్తం 58 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా క్యాపిటల్ రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రాజధానిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కింద నిర్వహించాలని, మొత్తం పది వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి తరలి రానున్నారు. వీరంతా హైరైజ్డ్ భవనాలలో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. దాదాపు 20 నుంచి ఆ పైన అంతస్థుల నిర్మాణాలు చేపట్టవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ రాజధానిలో ఒకే గొడుగున ఏర్పాటు చేసేందుకు 23 ఎకరాలు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పది వేల మంది ఉద్యోగుల్లో 60 శాతం మందికి పైగా కేంద్ర ప్రభుత్వం గృహ సముదాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరో 35 ఎకరాల స్థలం అవసరమని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తమకు భూములు కేటాయించాల్సిందిగా సీఆర్‌డీఏకు లేఖ రాసింది. కార్యాలయాల ఏర్పాటుకు ఎంత మేర భూములు అవసరమో తెలపాలని సీఆర్‌డీఏ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. వందల ఎకరాలు కేటాయించాల్సి ఉంటుందేమోనన్న భావనలో ఉన్న సీఆర్‌డీఏ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 58 ఎకరాల ప్రతిపాదన మాత్రమే రావటంతో ఆశ్చర్యపోయారు. పది వేల మంది ఉద్యోగులు పని చేయటానికి 58 ఎకరాలు చాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉండటంతో సీఆర్‌డీఏ అధికారుల్లో కూడా కొత్త ఆలోచన రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 25 వేల మంది వరకు ఉండడంతో కేంద్రం తరహాలోనే ఆలోచిస్తే తమకూ భూములు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Next Story