నేను పశుమాంసం తింటా: కిరణ్‌రిజుజు
గోవధ నిషేధం ఎన్డీఏ మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. బీఫ్ తినాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. కావాలంటే గోవధ నిషేధాన్ని హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న మహారాష్ర్టలో అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. సంప్రదాయాల ఆధారంగా ఆహారపు అలావాట్లు ఉంటాయని ఈ విషయాన్ని గుర్తించాలని […]
BY sarvi27 May 2015 10:57 AM IST

X
sarvi Updated On: 27 May 2015 11:45 AM IST
గోవధ నిషేధం ఎన్డీఏ మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది. బీఫ్ తినాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. కావాలంటే గోవధ నిషేధాన్ని హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న మహారాష్ర్టలో అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. సంప్రదాయాల ఆధారంగా ఆహారపు అలావాట్లు ఉంటాయని ఈ విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
Next Story