షరతులతో కూడిన డాన్స్
సల్మాన్ ఖాన్ డాన్స్ సమ్ థింగ్ స్పెషల్. అతడి స్టెప్పులు చూసేందుకు ఆడియన్స్ ఎగబడతారు. ఇదొక ఎత్తయితే.. సల్మాన్ సూపర్ స్టార్ ఇమేజ్ మరొక ఎత్తు. అందుకే దుబాయ్ లో జరగనున్న ఇండో-బాలీవుడ్ అవార్డు ఫంక్షన్ కు సల్మాన్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. ఈ ఫంక్షన్ లో భారీ మొత్తానికి సల్మాన్ డాన్స్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సల్మాన్ కు విదేశాలకు వెళ్లడం సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా […]
BY admin27 May 2015 5:44 AM IST
X
admin Updated On: 27 May 2015 6:13 AM IST
సల్మాన్ ఖాన్ డాన్స్ సమ్ థింగ్ స్పెషల్. అతడి స్టెప్పులు చూసేందుకు ఆడియన్స్ ఎగబడతారు. ఇదొక ఎత్తయితే.. సల్మాన్ సూపర్ స్టార్ ఇమేజ్ మరొక ఎత్తు. అందుకే దుబాయ్ లో జరగనున్న ఇండో-బాలీవుడ్ అవార్డు ఫంక్షన్ కు సల్మాన్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. ఈ ఫంక్షన్ లో భారీ మొత్తానికి సల్మాన్ డాన్స్ కూడా చేయబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సల్మాన్ కు విదేశాలకు వెళ్లడం సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్లడం ఇంకా కష్టం. ఈ దశలో సల్మాన్ కు అనుకూలంగా మరోసారి తీర్పునిచ్చింది కోర్టు.2లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించింది సల్మాన్ విదేశాలకు వెళ్లొచ్చని ఆదేశించింది. అంటే దుబాయ్ లో షరతులతో కూడిన డాన్స్ చేస్తాడన్నమాట సల్మాన్. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత పాస్ పోర్టును స్వాధీనం చేయాలని కూడా కోర్టు సల్మాన్ ను ఆదేశించింది. తాజా ఆదేశంతో సల్మాన్ కు మరింత వెసులుబాటు లభించింది. ఇకపై తన సినిమాల షూటింగుల కోసం కండలవీరుడు విదేశాలకు కూడా వెళ్లొచ్చు.
Next Story