రాయబరేలిలో ప్రియాంక పర్యటన..
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తన తల్లి సోనియాగాంధీ నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించారు. స్థానిక ప్రజలు, రైతులను పరామర్శించారు. పేదలతో మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన ప్రియాంక పొడి పొడిగా సమాధానమిచ్చారు. కేంద్రంలో విద్యా మంత్రిగా పనిచేస్తున్న స్మృతీ ఇరానీ అమేథిలో ట్రిపుల్ ఐటిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రియాంక కారు ఇసుకలో కూరుకుపోవడంతో కాసేపు ఆగాల్సి వచ్చింది. తమ పార్టీ కార్యకర్తలను కలవడానికే వచ్చాను తప్ప అంతకుమించి తన రాయబరేలీ […]
BY Pragnadhar Reddy26 May 2015 6:47 PM IST
Pragnadhar Reddy Updated On: 28 May 2015 6:43 AM IST
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తన తల్లి సోనియాగాంధీ నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించారు. స్థానిక ప్రజలు, రైతులను పరామర్శించారు. పేదలతో మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన ప్రియాంక పొడి పొడిగా సమాధానమిచ్చారు. కేంద్రంలో విద్యా మంత్రిగా పనిచేస్తున్న స్మృతీ ఇరానీ అమేథిలో ట్రిపుల్ ఐటిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రియాంక కారు ఇసుకలో కూరుకుపోవడంతో కాసేపు ఆగాల్సి వచ్చింది. తమ పార్టీ కార్యకర్తలను కలవడానికే వచ్చాను తప్ప అంతకుమించి తన రాయబరేలీ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదని ప్రియాంక తెలిపారు.
Next Story