ఆహుతవుతూ బీజేపీ వేదిక పైకి...
ఎన్డీఏ ఏడాది పాలన సందర్భంగా బీజేపీ ప్రజాసేవ పునరంకిత సభను నల్గొండ జిల్లాలో నిర్వహిస్తోంది.. ఒక్కసారిగా వేదికపైకి ఓ వ్యక్తి అంటుకున్న మంటలతో వచ్చాడు. హాహాకారాలు చేస్తూ అటూ ఇటు పరుగెడుతున్నాడు..అతడిని రక్షించడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగానే అతను అమాంతం కుప్పకూలిపోయాడు..ఈ సంఘటన జిల్లాలో కలకలం రేగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వేదిక మీదే ఉన్నారు. ఆ వెంటనే ఒక్క ఉదుటున వేదిక దిగి కిందకి వెళ్లిపోయారు. భూ పంచాయతీలో తిప్పర్తి తహశీల్దార్ విజయలక్ష్మి, […]
BY Pragnadhar Reddy26 May 2015 6:46 PM IST
Pragnadhar Reddy Updated On: 28 May 2015 1:25 AM IST
ఎన్డీఏ ఏడాది పాలన సందర్భంగా బీజేపీ ప్రజాసేవ పునరంకిత సభను నల్గొండ జిల్లాలో నిర్వహిస్తోంది.. ఒక్కసారిగా వేదికపైకి ఓ వ్యక్తి అంటుకున్న మంటలతో వచ్చాడు. హాహాకారాలు చేస్తూ అటూ ఇటు పరుగెడుతున్నాడు..అతడిని రక్షించడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుండగానే అతను అమాంతం కుప్పకూలిపోయాడు..ఈ సంఘటన జిల్లాలో కలకలం రేగింది. ఈ సమయంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వేదిక మీదే ఉన్నారు. ఆ వెంటనే ఒక్క ఉదుటున వేదిక దిగి కిందకి వెళ్లిపోయారు. భూ పంచాయతీలో తిప్పర్తి తహశీల్దార్ విజయలక్ష్మి, ఎస్ఐ విజయ్ కుమార్ లు వేధిస్తున్నారని యువకుడు ఆరోపిస్తూ శరీరానికి నిప్పు పెట్టుకున్నాడు. అనంతరం యువకుడిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. తరువాత కిషన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి అతడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆత్మహత్య గల కారణాలు తెలుసుకొనేందుకు ఆర్డీఓ, ఎమ్మార్వో వచ్చి యువకుడి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
Next Story