Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 95

బస్‌లో రద్దీగా ఉంది. ఒక మధ్యవయస్కురాలు ఎక్కింది. మర్యాద తెలిసిన కుర్రాడు లేచి కూర్చోండి మేడం అన్నాడు. ఆవిడ “కూర్చునే టైం లేదయ్యా! నేను తొందరగా వెళ్ళాలి” అంది. ——————————————————– తన భర్త కనిపించడం లేదని ఆమె పోలీసు రిపోర్టు ఇచ్చింది.             పోలీసులు పదిహేను మందిని తీసుకొచ్చి ఆమె ముందు నిల్చోబెట్టాడు. ఆమె అందర్నీ ఒక్కరొక్కరుగా పరిశీలించి “వీళ్ళల్లో ఒక్కరూ నాకు నచ్చలేదు” అంది. ——————————————————– డాన్స్‌ టీచర్‌ డాన్స్‌ నేర్పుతున్నాడు. తను చెప్పినప్పుడు ఒక […]

బస్‌లో రద్దీగా ఉంది. ఒక మధ్యవయస్కురాలు ఎక్కింది. మర్యాద తెలిసిన కుర్రాడు లేచి కూర్చోండి మేడం అన్నాడు. ఆవిడ “కూర్చునే టైం లేదయ్యా! నేను తొందరగా వెళ్ళాలి” అంది.
——————————————————–
తన భర్త కనిపించడం లేదని ఆమె పోలీసు రిపోర్టు ఇచ్చింది.
పోలీసులు పదిహేను మందిని తీసుకొచ్చి ఆమె ముందు నిల్చోబెట్టాడు. ఆమె అందర్నీ ఒక్కరొక్కరుగా పరిశీలించి “వీళ్ళల్లో ఒక్కరూ నాకు నచ్చలేదు” అంది.
——————————————————–
డాన్స్‌ టీచర్‌ డాన్స్‌ నేర్పుతున్నాడు.
తను చెప్పినప్పుడు ఒక అడుగు ముందుకెయ్యాలన్నాడు. అతను చెప్పకముందే ఆ అమ్మాయి అడుగుముందుకు వేసింది. అట్లా ఐదారుసార్లు చేసింది.
“చెప్పకముందే ఎందుకమ్మా కాలుజారుతావు” అన్నాడతను.
ఆ అమ్మాయి సిగ్గుతో “నాకింకా పెళ్ళికాలేదు సార్‌” అంది.!
——————————————————–
వార్తలు పంపేటప్పుడు పేర్లు ఎప్పుడూ ఖచ్చితంగా పంపాలని ఎడిటర్‌ ఆ జర్నలిస్టుకు చెప్పాడు. ఆ జర్నలిస్టు ఒక పల్లె నించి వార్త పంపాడు “అద్భుతమయిన మెరుపులు, వురుములు, పిడుగులు, ఉప్పొంగిపోతున్న వరదలో మూడు ఆవులు కొట్టుకుపోయాయి. వాటి పేర్లు ఎర్రావు, కర్రావు, కుంటావు…” ఇలా వ్రాసి పంపాడు.

First Published:  26 May 2015 6:33 PM IST
Next Story