Telugu Global
Others

మోడీ పాలన... బ‌య‌టే ప‌ల్ల‌కీ మోత‌

ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనపై అమెరికా మీడియా పెదవి విరిచింది. మోడీ పాల‌న ఎలా ఉందంటే ఇంట్లో ఈగ‌ల మోత… బ‌య‌ట ప‌ల్ల‌కీ మోత అన్న‌ట్టు ఉంద‌ని వ్యాఖ్యానించింది ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మోడీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పటివరకూ అది ప్రచారానికే పరిమితమైందని విమర్శించింది. ఉద్యోగ కల్పనపై భారీ అంచనాలు పెట్టుకున్నా జాబ్‌ మార్కెట్‌ ఇప్పటికీ స్తబ్ధుగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘ఇండియాస్ మోడీ ఎట్‌ వన్‌ ఇయర్‌: ‘యుఫోరియా ఫేజ్‌ ఈజ్‌ ఓవర్‌. […]

మోడీ పాలన... బ‌య‌టే ప‌ల్ల‌కీ మోత‌
X
ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనపై అమెరికా మీడియా పెదవి విరిచింది. మోడీ పాల‌న ఎలా ఉందంటే ఇంట్లో ఈగ‌ల మోత… బ‌య‌ట ప‌ల్ల‌కీ మోత అన్న‌ట్టు ఉంద‌ని వ్యాఖ్యానించింది ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మోడీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పటివరకూ అది ప్రచారానికే పరిమితమైందని విమర్శించింది. ఉద్యోగ కల్పనపై భారీ అంచనాలు పెట్టుకున్నా జాబ్‌ మార్కెట్‌ ఇప్పటికీ స్తబ్ధుగానే ఉందని వ్యాఖ్యానించింది. ‘ఇండియాస్ మోడీ ఎట్‌ వన్‌ ఇయర్‌: ‘యుఫోరియా ఫేజ్‌ ఈజ్‌ ఓవర్‌. చాలెంజెస్‌ లూమ్‌’ అంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాన్ని ప్రచురించింది. ఆర్థికాభివృద్ధిని పునరుజ్జీవింపచేయడానికి, మార్పు కోసం ప్రజలు మోదీకి అధికారం ఇచ్చారని, కానీ ఆ ఆశలు ఇంత‌వ‌ర‌కు సాకారం కాలేద‌ని వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ కుంటినడక నడుస్తోందని, కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ద్రవ్యోల్బణ ఆధారిత రుణాలు 2004 నుంచి ఎన్నడూ చూడని స్థాయికి దిగజారాయని, వరుసగా ఐదో నెలలోనూ ఎగుమతులు పడిపోయాయని వివరించింది. విదేశాల నుంచి చూస్తే, భారతదేశం ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోంది. స్వదేశంలో మాత్రం, ఉద్యోగాల పెరుగుదల మందకొడిగా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.
First Published:  27 May 2015 2:35 AM IST
Next Story