38 మంది వృద్ధులు సజీవ దహనం!
చైనాలోని ఓ వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 38 మంది సజీవ దహనం కాగా ఆరుగురు గాయపడ్డారు. హెనాన్ ప్రావిన్స్‌లోని లుషాన్ కౌంటీలో గల కాంగ్లేయూన్ విశ్రాంతి గృహానికి ఉన్నట్లుండి నిప్పంటుకుంది. ఈ దుర్ఘటనలో అందులో ఆశ్రయం పొందిన 51 మందిలో 38 మంది సజీవదహనమయ్యారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ సాగుతోందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందించాల్సిందిగా దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సూచించారు.
BY Pragnadhar Reddy26 May 2015 6:35 PM IST
Pragnadhar Reddy Updated On: 27 May 2015 11:31 AM IST

Next Story