కాంగ్రెస్ నాయకులపై సోమిరెడ్డి ఫైర్
ఆనాడు జగన్‌కు బానిసలుగా బతికి దోచుకున్న సొమ్మును దాచుకున్న అవినీతిపరులకు చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. మహానాడును దగానాడు అంటారా… లోకేష్‌ను సన్‌రైజ్ అంటూ పరోక్షంగా విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. వేలాది మందితో ముప్ఫై సంవత్సరాల నుంచి యేటాటా నిర్వహిస్తున్న మహానాడును చూసి ఓర్వలేకే ఇలాంటి ప్రేలాపనలు పేలుతున్నారని ఏపీపీసీసీ నేత ఎన్. రఘువీరారెడ్డిని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను విమర్శించారు. అవినీతిలో పుట్టి అవినీతితో […]
BY sarvi25 May 2015 6:57 PM IST
X
sarvi Updated On: 26 May 2015 12:52 PM IST
ఆనాడు జగన్‌కు బానిసలుగా బతికి దోచుకున్న సొమ్మును దాచుకున్న అవినీతిపరులకు చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. మహానాడును దగానాడు అంటారా… లోకేష్‌ను సన్‌రైజ్ అంటూ పరోక్షంగా విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. వేలాది మందితో ముప్ఫై సంవత్సరాల నుంచి యేటాటా నిర్వహిస్తున్న మహానాడును చూసి ఓర్వలేకే ఇలాంటి ప్రేలాపనలు పేలుతున్నారని ఏపీపీసీసీ నేత ఎన్. రఘువీరారెడ్డిని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను విమర్శించారు. అవినీతిలో పుట్టి అవినీతితో అంటకాగిన కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం పార్టీనిగాని, ప్రభుత్వాన్నగాని విమర్శించే అర్హత లేదని సోమిరెడ్డి అన్నారు. గత పదేళ్ళలో కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, బొత్స వాక్స్‌వేగన్, మద్యం కుంభకోణాల్లో చిక్కుకుపోగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మేఘమధనం, బయో డీజిల్ అవినీతి ఊబిలో చిక్కుకుపోయారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సన్‌సెట్‌ని చూశారు… ఢిల్లీలో ఓ సన్‌సెట్‌ని చూశారు… మీ జీవితాల్లో సన్‌సెట్ రాకుండా చూసుకోండని ఆయన హితవు చెప్పారు. అవినీతి తో అంటకాగిన ఫలితంగానే ఈనాడు వివిధ కేసుల్లో 70 మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఆ విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు.
Next Story