మరో 'ఎర్ర' స్మగ్లర్ అరెస్ట్
ఎర్రచందనం కేసులో ఏపీ పోలీసుల వేటకు ఫలితాలు లభిస్తున్నాయి. ఈ వేటలో అంతర్జాతీయ, జాతీయ స్మగ్లర్లు కూడా పట్టుబడుతున్నారు. గత పది రోజులుగా చేపట్టిన దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఎంతో కీలక సమాచారం లభించింది. దీని ఫలితంగా అంతర్జాతీయ స్మగ్లర్, చైనాకు చెందిన యాంగ్‌పింగ్‌ను, ఒరిస్సాకు చెందిన ముఖేష్ బదానీని, ఏపీకి చెందిన మస్తాన్‌వలీని పట్టుకోగలిగారు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కరు బయట పడుతున్నారు. ప్రస్తుతం […]
BY sarvi26 May 2015 9:17 AM IST
X
sarvi Updated On: 26 May 2015 9:24 AM IST
ఎర్రచందనం కేసులో ఏపీ పోలీసుల వేటకు ఫలితాలు లభిస్తున్నాయి. ఈ వేటలో అంతర్జాతీయ, జాతీయ స్మగ్లర్లు కూడా పట్టుబడుతున్నారు. గత పది రోజులుగా చేపట్టిన దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఎంతో కీలక సమాచారం లభించింది. దీని ఫలితంగా అంతర్జాతీయ స్మగ్లర్, చైనాకు చెందిన యాంగ్‌పింగ్‌ను, ఒరిస్సాకు చెందిన ముఖేష్ బదానీని, ఏపీకి చెందిన మస్తాన్‌వలీని పట్టుకోగలిగారు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కరు బయట పడుతున్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ముఖేష్ బదానీని ప్రశ్నించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ మణివణ్ణన్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్టు కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాతి తెలిపారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ముఖేష్ బదానీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీలో దాడులు చేసి మణివణ్ణన్ అలియాస్ విష్ణుభాయ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చెన్నైకి చెందిన ఇతను పదేళ్ళుగా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, అంతర్జాతీయ స్మగ్లర్లతో ఇతనికి సంబంధాలున్నాయని ఎస్పీ నవీన్ తెలిపారు. ప్రస్తుతం మారిషస్‌లో ఉన్న స్మగ్లర్ గంగిరెడ్డికి ఇతను అత్యంత సన్నిహితుడని, ఇపుడు పోలీసుల అదుపులో ఉన్న ముఖేష్ బదానీ కన్నా పెద్ద స్మగ్లర్ అని ఎస్పీ తెలిపారు. ఇతనిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో 353,307, 120బీ, 379, 34 ఐపీసీ చట్టం కింద, 30 పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. మణివణ్ణన్‌ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు కస్టడీకి అడుగుతామని ఎస్పీ తెలిపారు.
Next Story