Telugu Global
Cinema & Entertainment

నారా రోహిత్ నుంచి మరో విభిన్న చిత్రం

హీరోల్లో డిఫరెంట్ హీరో నారా రోహిత్. క్యారెక్టర్ రొటీన్ గా ఉంటే ఈ హీరోకు నచ్చదు. ఏదైనా కొత్తగా ఉండాలి. తొలి సినిమా బాణం నుంచి మొన్నొచ్చిన రౌడీ ఫెలో వరకు ఇదే ఫంథాలో వెళ్లాడు రోహిత్. తాజాగా మరోసారి తన రూటే సెపరేటు అని చూపించే ప్రయత్నంచేస్తున్నాడు. అసుర అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ఇప్పటికే ట్రయిలర్ తో అందర్నీ ఆకట్టుకున్న ఈసినిమాను జూన్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాలో నారా […]

నారా రోహిత్ నుంచి మరో విభిన్న చిత్రం
X
హీరోల్లో డిఫరెంట్ హీరో నారా రోహిత్. క్యారెక్టర్ రొటీన్ గా ఉంటే ఈ హీరోకు నచ్చదు. ఏదైనా కొత్తగా ఉండాలి. తొలి సినిమా బాణం నుంచి మొన్నొచ్చిన రౌడీ ఫెలో వరకు ఇదే ఫంథాలో వెళ్లాడు రోహిత్. తాజాగా మరోసారి తన రూటే సెపరేటు అని చూపించే ప్రయత్నంచేస్తున్నాడు. అసుర అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ఇప్పటికే ట్రయిలర్ తో అందర్నీ ఆకట్టుకున్న ఈసినిమాను జూన్ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాలో నారా రోహిత్ సరసన ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటించింది.

కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కార్తీక్ బాణీలందించాడు. తాజాగా విడుదలైన పాటల్లో ఓ 3 పాటలు కూడా క్లిక్కవ్వడంతో అసుర ప్రాజెక్ట్ పై కాస్తోకూస్తో అంచనాలు పెరిగాయి. నారా రోహిత్ కచ్చితంగా ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు సినిమా కథ ఏంటి.. రోహిత్ పాత్ర స్వభావం ఏంటనే అంశాల్ని టీం గోప్యంగా ఉంచడంతో సినిమాకు కాస్త హైప్ వచ్చింది. రోహిత్ కెరీర్ లో ఇప్పటివరకు సోలో మూవీనే బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమాను మించి అసుర సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

First Published:  26 May 2015 1:24 AM
Next Story