Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 94

ఒక ముసలతను డాక్టర్‌ దగ్గరికొచ్చాడు. డాక్టర్‌ అతన్ని పడుకోబెట్టి చేతులు పట్టి, కాళ్ళు పట్టి, ఒళ్ళు మసాజ్‌ చేసి అరగంట గడిచాక “ఎలా ఉంది?” అని అడిగాడు. ముసలతను “చాలాబాగుంది డాక్టర్‌! కాని నేను పంటినొప్పితో వచ్చాను” అన్నాడు. —————————————————- సాయంత్రం భర్త ఇంటికి వస్తూనే “నేను మీ కారియర్‌లో సర్దిన కూర ఎలా ఉంది?” అనడిగింది. “అద్భుతం” అన్నాడతను. “అంతేకాదు మా ఫ్రెండ్సందరూ కూడా నువ్వు చేసిన టమేటో పప్పు బ్రహ్మాండంగా ఉందని నిన్నే పొగిడారు” […]

ఒక ముసలతను డాక్టర్‌ దగ్గరికొచ్చాడు. డాక్టర్‌ అతన్ని పడుకోబెట్టి చేతులు పట్టి, కాళ్ళు పట్టి, ఒళ్ళు మసాజ్‌ చేసి అరగంట గడిచాక “ఎలా ఉంది?” అని అడిగాడు.
ముసలతను “చాలాబాగుంది డాక్టర్‌! కాని నేను పంటినొప్పితో వచ్చాను” అన్నాడు.
—————————————————-
సాయంత్రం భర్త ఇంటికి వస్తూనే “నేను మీ కారియర్‌లో సర్దిన కూర ఎలా ఉంది?” అనడిగింది. “అద్భుతం” అన్నాడతను. “అంతేకాదు మా ఫ్రెండ్సందరూ కూడా నువ్వు చేసిన టమేటో పప్పు బ్రహ్మాండంగా ఉందని నిన్నే పొగిడారు” అన్నాడు. ఆవిడ తాపీగా “ఈరోజు నేను మీ కారియర్‌లో సర్దింది చేపలపులుసు” అంది.
—————————————————-
పేషెంట్‌: నేను పోగొట్టుకున్న మొదటి పన్ను ఇదే!

డెంటిస్టు: అరే! తమాషాగా మన ఇద్దరి అనుభవాలూ ఒకే దగ్గరగా ఉన్నాయి. నేను పీకిన మొదటి పన్నూ మీదే!
—————————————————-
“పాలధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా ఏం చేద్దామనుకుంటున్నారు?”
“ఒక ఆవును కొందామనుకుంటున్నాను”
“కొని?”
“మా పాలవాడికే పాలమ్ముదామనుకుంటున్నాను. అప్పుడు కానీ మేము నెలకు అన్ని డబ్బులు కట్టడానికి పడే ఇబ్బంది వాడికి తెలిసివస్తుంది”.
—————————————————-
అతనికి భార్య అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నీరసపడిపోతుందని విపరీతంగా అల్లాడిపోయేవాడు. ఆమె ఆరోగ్యం కోసం అతిజాగ్రత్త తీసుకునేవాడు. రోజూ ఒక టాబ్లెట్‌ తీసుకోమని ఒక ఐరన్‌ టాబ్లెట్స్‌ బాటిల్‌ తెచ్చిచ్చాడు. మూడురోజుల తరవాత ఆమె సింకు దగ్గర నిల్చుని పాత్రలు కడుగుతూ ఉంటే “చేతులు చాలాసేపు నీళ్ళలో తడవనీకు. తుప్పు పడతాయేమో” అని హెచ్చరించాడు.

First Published:  25 May 2015 6:33 PM IST
Next Story