మహిళలకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మారుతీ సుజూకీ డ్రైవింగ్ స్కూళ్ల సహకారంతో ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో మహిళలకు డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఒ) హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ రేఖా లహోటి తెలిపారు. మహిళలకు 3, 4 చక్రాల వాహనాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1500 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, నగరంలో సుమారు 200 మందికి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. […]
BY Pragnadhar Reddy26 May 2015 1:40 AM IST
X
Pragnadhar Reddy Updated On: 11 Jun 2015 7:22 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మారుతీ సుజూకీ డ్రైవింగ్ స్కూళ్ల సహకారంతో ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో మహిళలకు డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఒ) హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ రేఖా లహోటి తెలిపారు. మహిళలకు 3, 4 చక్రాల వాహనాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1500 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, నగరంలో సుమారు 200 మందికి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పాసై 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి అర్హులన్నారు. వారి కుటుంబ ఆదాయం 3 లక్షల కన్నా తక్కువగా ఉండాలని, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఇన్‌కం ప్రూఫ్ సర్టిఫికేట్లతో తమ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Next Story