Telugu Global
Others

ఉద్యోగ క‌ల్ప‌న‌లో మోడీకి సున్నా మార్కులే: చిదంబ‌రం

భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 శాతం పాలనను పూర్తి చేసుకుందని, అయితే వారిచ్చిన హామీల మేరకు అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వానికి సున్నా మార్కులేనని ఎద్దేవా చేశారు. డబ్బులొచ్చే పారిశ్రామిక వేత్తలు మాత్రమే ఈ ప్ర‌భుత్వానికి పదికి పది మార్కులు వేస్తారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అనుకున్నా, […]

ఉద్యోగ క‌ల్ప‌న‌లో మోడీకి సున్నా మార్కులే: చిదంబ‌రం
X
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 శాతం పాలనను పూర్తి చేసుకుందని, అయితే వారిచ్చిన హామీల మేరకు అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వానికి సున్నా మార్కులేనని ఎద్దేవా చేశారు. డబ్బులొచ్చే పారిశ్రామిక వేత్తలు మాత్రమే ఈ ప్ర‌భుత్వానికి పదికి పది మార్కులు వేస్తారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అనుకున్నా, వాటిని విధానాలుగా రూపొందించి, కార్యక్రమాలుగా అమలు చేసే నిర్దిష్ట ప్రక్రియ కనిపించడం లేదని చెప్పారు. వాస్తవానికి ఏడాది కాలంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నది జీఎస్‌టీ బిల్లు, భూసేకరణ బిల్లు మాత్రమేనని తెలిపారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీలను కూడా పక్కకు తప్పించి 50 బిల్లుల్ని చట్టాలుగా ఆమోదించుకుందని చెప్పారు.
First Published:  26 May 2015 12:06 PM GMT
Next Story