Telugu Global
CRIME

ఎడ్యుకేటెడ్ క్రిమిన‌ల్... 23 ల‌క్ష‌లు స్వాధీనం

ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంగ్ల మాధ్యమంలో చ‌దువుకున్న ఓ యువ‌కుడు వ్య‌స‌నాల‌కు బానిసై… నేరాల బాట పడ్డాడు.  ఇత‌ను ఎంత తెలివైన వాడంటే… ఏ ఇంట్లో ఎంత బంగారం దొంగిలించాడో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాడు. సైబరాబాద్‌లో వరుస చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆ నేరగాడ్ని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ నేరపరిశోధన విభాగ ఓఎస్డీ డాక్టర్‌ బి.నవీన్‌కుమార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో వెల్లడించారు. బెంగళూరులోని ఆంధ్రాహల్లి విద్యామన్యనగర్‌కు […]

ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆంగ్ల మాధ్యమంలో చ‌దువుకున్న ఓ యువ‌కుడు వ్య‌స‌నాల‌కు బానిసై… నేరాల బాట పడ్డాడు. ఇత‌ను ఎంత తెలివైన వాడంటే… ఏ ఇంట్లో ఎంత బంగారం దొంగిలించాడో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాడు. సైబరాబాద్‌లో వరుస చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆ నేరగాడ్ని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ నేరపరిశోధన విభాగ ఓఎస్డీ డాక్టర్‌ బి.నవీన్‌కుమార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో వెల్లడించారు. బెంగళూరులోని ఆంధ్రాహల్లి విద్యామన్యనగర్‌కు చెందిన కల్యా విజయసింహ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. బెంగళూరులో డిగ్రీ వరకు ఇంగ్లీష్‌ మీడియం చదివాడు. తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందిన విజయసింహ వ్యసనాలకు బానిసై చోరీల బాట పడ్డాడు. 1997 నుంచి బెంగళూరులో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నేరాలు చేశాడు. కర్ణాటకలోని యశ్వంత్‌పూర, శ్రీరాంపురలో దొంగతనాలు చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం లా సన్స్‌ బే కాలనీలో గదిని అద్దెకు తీసుకుని అక్కడా చోరీలు చేశాడు. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చి చోరీలు చేసి 2013లో ముషీరాబాద్‌ పోలీసులకు దొరికిపోయాడు. 2014 ఆగస్టులో జైలు నుంచి విడుదలైన విజయసింహ వనస్థలిపురం, శంషాబాద్‌, కంచన్‌బాగ్‌, బేగంపేట, ఎస్‌ఆర్‌నగర్‌లో దొంగతనాలు చేశాడు. ఏడాది కాలంగా చోరీలు చేస్తున్న విజయసింహను వనస్థలిపురం పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌, 770 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.23.63 లక్షలుంటుంది. విజయసింహపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలో 200 చోరీ కేసులు ఉన్నాయి. విజయసింహ ఎన్నిసార్లు పోలీసులకు చిక్కినా లెక్క మాత్రం మరిచిపోయేవాడు కాదు. ఏ ఇంట్లో ఎంత బంగారం, ఎంత నగదు దొంగిలించాడో లెక్కలు చకచకా చెప్పేస్తాడని పోలీసులు తెలిపారు.
First Published:  25 May 2015 6:39 PM IST
Next Story