మోడీ పాలనలో అంబానీలు డౌన్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యేడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద 10 లక్షల కోట్ల రూపాయలను దాటింది. మార్కెట్లు ఈ స్థాయిలో ఉప్పొంగి కదం తొక్కినా దేశంలో నెంబర్‌వన్ కుబేర కుటుంబం- అంబానీలకు చెందిన కంపెనీల మార్కెట్ క్యాపిటల్ మాత్రం క్షీణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో గుజరాత్‌కు చెందిన గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ అసాధారణ స్థాయిలో పెరిగింది. అదానీలు ప్రధాని మోడీకి […]
BY Pragnadhar Reddy26 May 2015 2:33 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 May 2015 2:33 AM IST
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యేడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో మదుపరుల సంపద 10 లక్షల కోట్ల రూపాయలను దాటింది. మార్కెట్లు ఈ స్థాయిలో ఉప్పొంగి కదం తొక్కినా దేశంలో నెంబర్‌వన్ కుబేర కుటుంబం- అంబానీలకు చెందిన కంపెనీల మార్కెట్ క్యాపిటల్ మాత్రం క్షీణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో గుజరాత్‌కు చెందిన గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ అసాధారణ స్థాయిలో పెరిగింది. అదానీలు ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే.ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీ వచ్చినప్పుడు మోడీ ఉపయోగించిన ప్రైవేట్ జెట్ అదానీలదే. అదానీతో పాటు టాటాలు, భారతి, సన్‌గ్రూప్ కంపెనీల షేర్లు కూడా ఈ ఏడాది కాలంలో భారీ లాభాలను నమోదు చేశాయి. అంబానీల కంపెనీలతోపాటు ఐటిసి, వేదాంత, ఎల్ అండ్ టి కంపెనీలు మాత్రం ప్రతికూలతను చవి చూశాయి. ఏడాది పాలన మధ్యలో రమారమి 30 శాతం లాభపడి జీవితకాల గరిష్ఠస్థాయిలను తాకిన సూచీలు సరిగ్గా ఏడాది పూర్తయ్యేసరికి కేవలం 12 శాతం లాభంతో సరిపెట్టుకున్నాయి. అంటే మోడీ పాలనపై మోజు తగ్గినందువల్లే మార్కెట్ లాభాలు తగ్గి ఉండవచ్చన్నది విశ్లేషకుల అంచనా.
Next Story